|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అనిల్ రావిపూడి ఎవరో తెలీదన్న హీరోయిన్! బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సంచలన కామెంట్స్!

Published: 29-01-2026, 11:45 PM
షాకింగ్: అనిల్ రావిపూడి ఎవరో తెలీదన్న హీరోయిన్! బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సంచలన కామెంట్స్!
  • డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎవరో తెలీదన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు!
  • సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐశ్వర్యకు షాకింగ్ కామెంట్స్!
  • సినిమా ఆఫర్ వచ్చే వరకు అనిల్ రావిపూడి గురించి తెలీదని చెప్పిన ఐశ్వర్య రాజేష్.
  • కామెడీ క్యారెక్టర్ చేయడంపై భయం వేసిందని, అనిల్ ధైర్యంతోనే చేశానని వెల్లడి.

టాలీవుడ్లో సంచలనం! డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్! అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

అనిల్ రావిపూడి ఎవరో తెలీదన్న హీరోయిన్ కామెంట్స్ వైరల్!

వరుస విజయాలతో తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పేరు తెలియని వారుండరు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన విజయాలు అందుకుంటున్నాడు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో వచ్చిన అనిల్ రావిపూడి బాక్సాఫీసును షేక్ చేశారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా.. వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రతి సంక్రాంతికి ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇస్తూ.. ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి అంటే ఎవరో తెలియదు అని టాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

సినిమా ఆఫర్ వచ్చే వరకు తెలీదన్న ఐశ్వర్య రాజేష్

అసలు విషయంలోకి వెళితే.. అనిల్ రావిపూడి ఎవరో తెలియదని చెప్పిన హీరోయిన్ మరెవరో కాదు.. ఆయన డైరెక్షన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). ఈ అమ్మడుకి ఇందులో అవకాశం ఇచ్చేవరకు ఆయన ఎవరో తెలియదు చెప్పడం గమనార్హం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘సంక్రాంతికి వస్తున్నాం రాకముందు ఓ ఏడాది వరకు నాకు అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే అనిల్ రావిపూడిగారు ఫోన్ చేశారు. ఆడిషన్ చేయాలి సినిమా కోసం అన్నారు. ఆరోజు ఆయన ఫోన్ చేసే వరకు అనిల్ రావిపూడి ఎవరో తెలియదు. కాల్ కట్ అయ్యాక ఆయన పేరు గూగుల్ సెర్చ్ చేశాను. ఆ తర్వాత అడిషన్‌కు వెళ్లాను.

కామెడీ రోల్ చేయడానికి భయపడ్డానన్న హీరోయిన్

అక్కడ నాతో రెండు మూడు డైలాగులు చెప్పించడంతో పాటుగా.. మేకప్ కూడా వేశారు. నేను స్క్రిప్ట్ కూడా చదివిన తర్వాత ఆ పాత్రకు నేను అవ్వను అని అనిల్ రావిపూడితో చెప్పాను. సీరియస్ పాత్రలు చేసే నేను కామెడీ క్యారెక్టర్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. కానీ అనిల్ రావిపూడి గారు మీకెందుకు నేను ఉన్నానుగా అని భరోసా ఇచ్చారు. అందుకే ఈ అవకాశం ఒప్పుకున్నాను’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.