|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నైటీలో రా.. బాడీ చూస్తా! ఐశ్వర్య రాజేష్ సంచలన ఆరోపణలు!

Published: 30-01-2026, 10:05 AM
షాకింగ్: నైటీలో రా.. బాడీ చూస్తా! ఐశ్వర్య రాజేష్ సంచలన ఆరోపణలు!
  • ఐశ్వర్య రాజేష్: నైటీలో చూడాలని డైరెక్టర్ కామెంట్స్, ఇండస్ట్రీలో సంచలనం!
  • వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య నటనకు ప్రశంసలు, టాలీవుడ్ ఆఫర్స్ లేవు!
  • కెరీర్ తొలినాళ్లలో చేదు అనుభవాలు, ఆవేదన వ్యక్తం చేసిన ఐశ్వర్య రాజేష్.
  • ఆ దర్శకుడు ఎవరు? పేరు బయటపెట్టని ఐశ్వర్య రాజేష్, అభిమానుల్లో ఉత్కంఠ!

ఐశ్వర్య రాజేష్ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది! ఆమె కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను స్వయంగా వెల్లడించింది. ఇది టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది!

డైరెక్టర్ నైటీ కామెంట్స్: ఐశ్వర్య రాజేష్ షాకింగ్ రియాక్షన్!

Aishwarya Rajesh: తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు ఐశ్వర్య రాజేష్. చాలా తమిళ సినిమాలతో ఆమె తెలుగునాట సుపతిచితురాలిగా మారిపోయింది. రీసెంట్ గా ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో భాగ్యం పాత్రలో గడుసు పెళ్ళాంగా అదరగొట్టేసింది ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh).

‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్, టాలీవుడ్ ఆఫర్స్ లేని వైనం!

అయితే, ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించినా టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ అందుకోలేదు ఈ అమ్మడు. ఇదిలా ఉంటే, తాజాగా ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. దీనికి సంబందించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెరీర్ తొలినాళ్లలో చేదు అనుభవాలు: ఐశ్వర్య ఎమోషనల్!

ఈ వీడియో ఆమె మట్లాడుతూ.. నా కెరీర్ స్టార్టింగ్ లో నేను ఒక సినిమా ఆడియన్స్ కి వెళ్లాను. ఆ డైరెక్టర్ నన్ను నైట్ డ్రెస్సులో కనిపించు అన్నాడు. ఎందుకంటే, అతను నా బాడీ చుడాలని అన్నాడు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడు అని తరువాత అనుకున్నాను. చాలా బాధేసింది’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. అయితే, తనను అలా అడిగిన దర్శకుడు ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు. అలాగే ఇంకా ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి, కెరీర్, ఫ్యామిలీ విషయాలు చాలానే చెప్పింది ఐశ్వర్య రాజేష్. దీంతో ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.