|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య రాజేష్ రొమాన్స్! నెటిజన్స్ ఫైర్!

Published: 27-03-2026, 7:15 AM
షాకింగ్: 66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య రాజేష్ రొమాన్స్! నెటిజన్స్ ఫైర్!
  • నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’‌లో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా ఎంపిక, త్వరలో షూటింగ్‌లో జాయిన్ కానున్నారు!
  • 66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య రొమాన్స్ పై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు.. కొందరు విమర్శలు, మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.
  • నాగార్జున, టబు కాంబినేషన్ సీన్స్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ కానుంది!
  • గతంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో విజయం సాధించిన ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు నాగార్జునతో కలిసి నటించనుంది.

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన 100వ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించనుండటం హాట్ టాపిక్‌గా మారింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

నాగ్ 100వ చిత్రంలో ఐశ్వర్య రాజేష్!

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, ‘లాటరీ కింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ‘మనం ఎంటర్‌ప్రైజెస్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటించబోతోందని, ఆమె త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు నేరుగా స్టార్ హీరో నాగార్జున సరసన ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.

ఏజ్ గ్యాప్‌పై నెటిజన్ల రియాక్షన్లు!

అయితే, 66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య జోడీ కట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఏజ్ గ్యాప్ గురించి , హిట్ కోసం కక్కుర్తి పడకని విమర్శలు చేస్తుంటే, మరికొందరు మాత్రం నాగార్జున సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది, అందుకే ఐశ్వర్య ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది అని మద్దతు ఇస్తున్నారు. ఇక వరుస హిట్లతో జోరు మీదున్న నాగ్ సరసన నటిస్తే తన కెరీర్ మరో మెట్టు పైకి ఎదుగుతుందని ఐశ్వర్య భావిస్తోందట. ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే.. ఒకప్పుడు నాగార్జునతో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి టబు ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

మళ్ళీ కలిసిన నాగ్ – టబు జోడీ!

Read More : నన్ను నేను పరిపూర్ణం చేసుకోవడానికి పురుషుడు అవసరం లేదు.. పుకార్లకు చెక్ పెట్టిన Malaika Arora

నాగార్జున, ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.