|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ వారసుడి లాంచ్‌కు కృష్ణ ఫోటోనే స్ఫూర్తి! అజయ్ భూపతి సంచలన ప్రకటన!

Published: 05-01-2026, 6:30 AM
మహేష్ వారసుడి లాంచ్‌కు కృష్ణ ఫోటోనే స్ఫూర్తి! అజయ్ భూపతి సంచలన ప్రకటన!
  • అజయ్ భూపతి దర్శకత్వంలో మహేష్ మేనల్లుడు జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కుతోంది.
  • కృష్ణ గారి ఫోటో చూడగానే జయకృష్ణను హీరోగా ఎంపిక చేశానని అజయ్ భూపతి వెల్లడి.
  • తనపై మహేష్ బాబుకు నమ్మకం ఉందని, సినిమా అప్డేట్స్ ఆయనకు తెలుసని అజయ్ భూపతి తెలిపారు.
  • గౌతమ్‌ను మాస్ టచ్ కథతో లాంచ్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అజయ్ భూపతి ప్రకటన.

డైరెక్టర్ అజయ్ భూపతి తన కొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్న అజయ్, కృష్ణ గారి ఫోటోనే తనకు స్ఫూర్తి అన్నాడు. గౌతమ్‌ను లాంచ్ చేసే అవకాశం వస్తే చేస్తానని కూడా తెలిపారు.

జయకృష్ణ ఎంపికకు కృష్ణ గారి ఫోటో స్ఫూర్తి

Ajay Bhupathi : RX100 సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత మహాసముద్రం యావరేజ్ గా నిలిచినా మంగళవారం సినిమాతో అందర్నీ మెప్పించాడు. అజయ్ భూపతి సినిమా అంటే ఏదో డిఫరెంట్ గా ఉంటుంది అనేలా తనకంటూ ఓ మార్క్ తెచ్చుకున్నాడు. అజయ్ భూపతి మంగళవారం 2 సినిమా తీసే ముందే శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో రాబోతున్నాడు.(Ajay Bhupathi)

మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ భామ రాషా తడానీ హీరోయిన్ గా శ్రీనివాస మంగాపురం సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా అజయ్ భూపతి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్, కృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

అజయ్ భూపతిపై మహేష్ బాబు నమ్మకం

అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఈ కథ ఎప్పట్నుంచో ఉంది. జయకృష్ణ బాగా నచ్చాడు నాకు. మంగళవారం 2 పనుల్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. అతన్ని కలవడానికి వెళ్తే వాళ్ళింట్లో హాల్ లో నవ్వుతూ ఉన్న ఒక పెద్ద కృష్ణ గారి ఫోటో ఉంది. ఆ ఫోటో చూస్తుంటే నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. నన్నే చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది. అప్పుడే జయకృష్ణతో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యా. అప్పుడే ఈ సినిమాని ప్రస్టేజియస్ గా తీసుకున్నా. కృష్ణ గారి మనవడు హీరో కాబట్టి ఒక అంచనాలు ఉంటాయి. ఇది కొత్త అబ్బాయి అమ్మాయితో చేయాల్సిన సినిమానే. అంచనాలను రీచ్ అవుతాం అని తెలిపాడు.

గౌతమ్‌ను లాంచ్ చేసే అవకాశం వస్తే?

అలాగే మహేష్, గౌతమ్ గురించి మాట్లాడుతూ.. RX100 తర్వాతే మహేష్ బాబు ఒకసారి పిలిపించారు. అప్పుడే మహేష్ బాబు ని కలిసాను. ఆ తర్వాత మళ్ళీ కలవలేదు. కానీ మా సినిమా షూటింగ్ అప్డేట్స్ అన్ని ఆయనకు తెలుసు. నా మీద ఆయనకు నమ్మకం ఉంది అన్నారని ఆయన వేరే వాళ్లకు చెప్పినట్టు తెలిసింది. గౌతమ్ ని లాంచ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తాను. ఒకవేళ గౌతమ్ తో చేస్తే ఒక చిన్న మాస్ టచ్ తో, క్యారెక్టరయిజేషన్ లో మాస్ తో ఉండే కథతో చేస్తాను అని తెలిపారు.

మొత్తానికి అజయ్ భూపతి వ్యాఖ్యలు మహేష్ బాబు అభిమానులలో ఆసక్తిని రేకెత్తించాయి. శ్రీనివాస మంగాపురం సినిమాపై అంచనాలు పెరగడంతో పాటు, భవిష్యత్తులో గౌతమ్ ఎంట్రీపై కూడా చర్చ మొదలైంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.