|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థాలా అజిత్ సంచలన నిర్ణయం! ఇకపై నిర్మాతగానూ అదరగొట్టేందుకు సిద్ధం! ఫ్యాన్స్ కి పండగే!

Published: 09-04-2026, 2:05 PM
  • AK64 సినిమాతో నిర్మాతగా మారనున్న అజిత్ కుమార్.
  • ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఫండింగ్ సపోర్ట్ అందించనుంది.
  • రెమ్యునరేషన్ విషయంలో విభేదాలే కారణమంటున్న కోలీవుడ్ వర్గాలు.
  • నెలలో 15 రోజులు షూటింగ్, 15 రోజులు రేసింగ్‌పై ఫోకస్.

తమిళ హీరో అజిత్ కుమార్ AK64 సినిమాతో నిర్మాతగా మారబోతున్నారు. రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన రేసింగ్ కెరీర్‌పై కూడా దృష్టి పెట్టనున్నారు.

నిర్మాతగా అజిత్ కుమార్ కొత్త అవతారం!

Ajith Kumar: తమిళ నాట ఎంతమంది హీరోలున్నా అజిత్ కుమార్ కున్న క్రేజ్ మరో లెవల్. సినిమాలకి అతీతంగా అజిత్ ని అభిమానించే ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఇక ఇప్పటికే ‘విడముయర్చి’,’గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అజిత్ తన AK 64 కోసం ఇప్పుడో సాలిడ్ ప్లాన్ ని సిద్దం చేశాడని కోలీవుడ్ కోడై కూస్తుంది.మాములుగా అజిత్ సినిమాలంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయ్.కాని AK 64 సినిమా విషయంలో వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్ కి అంతకు మించిన కిక్ ఇస్తున్నాయ్.

కొత్త అవతారం ఎత్తబోతున్న అజిత్

అవును.. అజిత్ కుమార్ ఈ సినిమాతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతున్నారట. ఇప్పటివరకు కేవలం వెండితెరపై హీరోగా అలరించిన ఆయన,తొలిసారిగా నిర్మాణ బాధ్యతలను తన భుజాన వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తమిళనాట విపిస్తున్న వార్త. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉందండోయ్..ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఫండింగ్ సపోర్ట్‌తో అజిత్ ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారని, దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని సమాచారం.

సొంతంగా రంగంలోకి దిగడమే బెటర్

రెమ్యునరేషన్ వివాదాలే కారణమా?

అయితే  రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలతో తలెత్తిన కొన్ని విభేదాలే దీనికి కారణమని అందుకే అజిత్ ఇలా సడన్ నిర్ణయం తీసుకున్నాడన్నరూమర్ గట్టిగా సర్క్యులేట్ అవుతుంది.ఇక తన మార్కెట్ విలువకు తగ్గట్టుగా,తన క్రియేటివ్ ఫ్రీడమ్‌కు భంగం కలగకుండా ఉండాలంటే సొంతంగా రంగంలోకి దిగడమే బెటర్ అని అజిత్ భావించి ఈ డిసీషన్ తీసుకున్నాడట.ఇక ఇప్పటికే  ‘మార్క్ ఆంటోనీ’ లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన  డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

15 -15 డేస్ మాస్టర్ ప్లాన్

ఇక ఈ సినిమా విషయంలో అజిత్ వేసిన మరో మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా..15 -15 డేస్.అంటే ఎంటంటారా.అజిత్ కు రేసింగ్ అంటే ఎంత ప్రాణమో చెప్పక్కర్లేదు.కాస్త షూటింగ్ గ్యాప్‌ దొరికినా బైక్ వేసుకుని ప్రపంచమంతా చుట్టేస్తుంటారు.అయితే ఈసారి  AK 64 కోసం ఆయన స్పెషల్ గా షెడ్యూల్ ఫిక్స్ చేశాడట.అదే 15 -15 డేస్.దీని ప్రకారం నెలలో కేవలం 15 రోజులు మాత్రమే సినిమా షూటింగ్‌కు కేటాయించి,మిగిలిన 15 రోజులు పూర్తిగా తన రేసింగ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టబోతున్నారట.అంటే అటు ప్రొఫెషనల్ యాక్టింగ్ కెరీర్ దెబ్బతినకుండా ఇలా తన పర్సనల్ ప్యాషన్‌ను కొనసాగించేలా ఈ ప్లాన్ వేసుకున్నాడన్న మాట.

బ్యాక్ టు బ్యాక్ డబల్ ట్రీట్

సో ..’థాలా’ తీసుకున్న ఈ డిసీషన్ వల్ల  ఫ్యాన్స్‌కు అటు సినిమా షూటింగ్ అప్‌డేట్స్ తో పాటు ఇటు రేసింగ్ ట్రాక్ నుంచి అజిత్ ఫోటోలు అంటూ బ్యాక్ టు బ్యాక్  డబల్ ట్రీట్ దొరకనుండటంతో మురిసిపోతున్నారు అజిత్ ఫ్యాన్స్.ఇక మే మొదటి వారంలోనే ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉండటంతో  ఒకేసారి హీరోగా, నిర్మాతగా, రేసర్‌గా అజిత్ చేయబోతున్న ఈ ట్రిపుల్ రైడ్ సెన్సేషన్ కోసం ఇండస్ట్రీ అంతా క్యూరియస్ గా వాచ్ చేస్తుంది.చూడాలి మరి నిర్మాతగా మొదటిసారిగా బరిలోకి దిగుతున్న ఈ మల్టీ టాలెంటెడ్ ఏ మేరకి సక్సెస్ అవుతాడో !

15-15 డేస్ మాస్టర్ ప్లాన్!

#AK64 shooting likely to kickstart from May 1st week🎬🔥 #Ajithkumar will be concentrating on Films & Racing in parallel, like 15 Days for shoot & 15 Days for Racing🏎️

Directed by AadhikRavichandran, AK is considering to produce the film himself, backed by the funding of another… pic.twitter.com/Xl3CUZGuxJ

— AmuthaBharathi (@CinemaWithAB) April 9, 2026

మొత్తానికి అజిత్ నిర్మాతగా మారి తన AK64 సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.