
తమిళ సినిమా హీరో అజిత్ కు ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన భార్య షాలినికి విజయానికి కారణమని క్రెడిట్ ఇచ్చారు. షాలిని తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని అజిత్ పేర్కొన్నారు.
Key Points
అజిత్ కు పద్మ భూషణ్ అవార్డు లభించింది.
భార్య షాలిని తన సక్సెస్ కు కారణమని అజిత్ పేర్కొన్నాడు.
షాలిని తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని అజిత్ తెలిపాడు.
అజిత్ సూపర్ స్టార్ బిరుదులపై నమ్మకం లేదని వెల్లడించాడు.
పద్మ భూషణ్ అవార్డు అందుకున్న అజిత్
తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.
భార్య షాలినికి కృతజ్ఞతలు తెలిపిన అజిత్
ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు’
సినిమా, జీవితం గురించి అజిత్ అభిప్రాయాలు
‘నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు’ అని అజిత్ చెప్పుకొచ్చాడు.
తమిళ హీరోగా అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.
తన విజయానికి భార్య షాలినినే కారణంగా చెప్పుకున్న అజిత్, ఆమె త్యాగాలను కొనియాడారు. సూపర్ స్టార్ బిరుదులపై తనకు నమ్మకం లేదని తెలిపారు. అజిత్ కుటుంబ జీవితం, సినిమా కెరీర్ ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకం.


