|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు

Published: 14-12-2025, 3:48 AM
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు
  • `అఖండ 2` మూవీ రెండో రోజు కలెక్షన్లు మొదటి రోజుతో పోల్చితే 35-40% పడిపోయాయి.
  • మొదటి రోజు ఇండియాలో రూ.30 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.59 కోట్లు వసూలు చేసింది.
  • రెండు రోజులకు ఇండియాలో మొత్తం రూ.46 కోట్ల వసూళ్లు సాధించింది, ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ.
  • రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే రూ.260 కోట్లు సాధించి సేఫ్ అయ్యింది.

బాలకృష్ణ నటించిన `అఖండ 2 తాండవం` చిత్రం విడుదలై రెండు రోజులు పూర్తయ్యింది. మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా తగ్గాయి. రెండు రోజుల మొత్తం వసూళ్లతో పాటు, సినిమా బడ్జెట్, బిజినెస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

`అఖండ 2` రెండు రోజుల కలెక్షన్లు: తొలి రోజు vs రెండో రోజు

బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2 తాండవం` మూవీ శుక్రవారం విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినా మొదటి రోజు భారీ వసూళ్లని రాబట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? పెరిగాయా? తగ్గాయా అనేది చూస్తే. `అఖండ 2` మూవీ రెండో రోజు తగ్గాయి. మొదటి రోజుతో పోల్చితే  దాదాపు 35-40శాతం కలెక్షన్లు డ్రాప్‌ అయినట్టు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

`అఖండ 2` మొదటి రోజు ఇండియాలో రూ.30 కోట్ల ఇండియా కలెక్షన్లని సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.59కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ ప్రకటించింది. ఇందులో ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా తొమ్మిదిన్నర కోట్లని సాధించింది. ఇక రెండో రోజు వసూళ్లు ఇండియాలో ఈ మూవీకి రూ.15కోట్ల  కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ మూవీ ఇప్పటి వరకు ఇండియాలో రూ.46కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఇందులో మేజర్‌గా తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుండటం విశేషం. మిగిలిన అన్ని భాషలు కలిపి కనీసం కోటి రూపాయలు కూడా రాకపోవడం గమనార్హం. ఈ సినిమాని పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేశారు. బాలయ్య నుంచి వచ్చిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. ఆథ్యాత్మిక అంశాలుండటం, శివుడు గురించి అంశాలు ఉండటంతో నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావించారు. కానీ ఫలితం తలక్రిందులయ్యింది. నార్త్ లో కోటి కూడా వసూలు చేయలేకపోయింది. ఇదే ఇప్పుడు షాకిస్తుంది.

పాన్ ఇండియాలో `అఖండ 2`కు నిరాశే మిగిలిందా?

ఇదిలా ఉంటే `అఖండ 2` బడ్జెట్‌ వివరాలు చూస్తే, ఈ సినిమాకి రెండు వందల కోట్ల బడ్జెట్‌ అయ్యిందట. కాకపోతే బిజినెస్‌ గట్టిగానే జరిగిందంటున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకుందట. అందుకు గానూ రూ.85కోట్లు చెల్లించినట్టు సమాచారం. అన్ని భాషలు కలిపి శాటిలైట్‌ రైట్స్ రూ.60కోట్లు అని టాక్. థియేట్రికల్‌ రైట్స్ చూస్తే రూ.115కోట్లు అని సమాచారం. తెలుగు స్టేట్స్ లో రూ.88కోట్లు, ఓవర్సీస్‌ రూ.15కోట్లు, రెస్ట్ ఆఫ్‌ ఇండియా రూ.11కోట్లకు అమ్ముడు పోయిందట. ఇందులోనూ నైజాంలో రూ.23.50 కోట్లు, సీడెడ్లో రూ.22 కోట్లు, ఉత్తర ఆంధ్రలో రూ.11.50కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.7.50కోట్లు, వెస్ట్ గోదావరి రూ.5.50కోట్లు, గుంటూరు రూ.8.50కోట్లు, కృష్ణ రూ.5.75, నెల్లూర్‌ రూ.4 కోట్లు అని ట్రేడ్‌ వర్గాల సమాచారం.

ఈ లెక్కన `అఖండ 2` రిలీజ్‌కి ముందే సేఫ్‌లోకి వచ్చింది. ఎందుకంటే ఈ చిత్రానికి థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలిపి దాదాపు రూ.260కోట్ల వరకు వచ్చింది. సినిమాకి పెట్టిన ఖర్చు సుమారు రూ.200కోట్లు. నిర్మాతలు రిలీజ్‌కి ముందే సేఫ్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు బయ్యర్లకి అసలు పరీక్ష అని చెప్పొచ్చు. ఈ మూవీ ఇప్పటి వరకు నలభై కోట్ల వరక షేర్‌ వసూలు చేసింది. ఇంకా డెబ్బ కోట్లకుపైగా షేర్‌ రావాలి. అంటే రూ.140కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్ట్ చేయాలి. అది సాధ్యమేనా అనేది ప్రశ్న. ఈ చిత్రానికి ఆదివారం ఒక్కరోజు భారీ వసూళ్లకి ఛాన్స్ ఉంది. వీక్‌ డేస్‌లో భారీగా పడిపోతాయి. దీంతో ఇంతటి భారీ టార్గెట్‌ రీచ్‌ కావడం కష్టం. అదే జరిగితే బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.

`అఖండ 2` బడ్జెట్, బిజినెస్ వివరాలు: ఓటీటీ, శాటిలైట్ హక్కులు

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2 తాండవం` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన నాల్గో సినిమా ఇది. గతంలో `సింహ`, `లెజెండ్‌`, `అఖండ` చిత్రాలు వచ్చాయి. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది. అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెల 12న ఈ మూవీ విడుదలైంది. ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఫస్ట్ రోజు మాత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా, సంయుక్త, పూర్ణ, హర్షాలి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.

`అఖండ 2` కలెక్షన్లు రెండో రోజు తగ్గినా, ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో సినిమా ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది. అయితే, పాన్ ఇండియా స్థాయిలో మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదని స్పష్టమైంది. ఈ వసూళ్లను సినిమా ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.