|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Issues : ఇదంతా ఫ్లోలో జరుగుతుందా… లేదా బాలయ్యపై కక్ష కట్టారా?

Published: 11-12-2025, 6:48 AM
Akhanda 2 Issues : ఇదంతా ఫ్లోలో జరుగుతుందా… లేదా బాలయ్యపై కక్ష కట్టారా?
  • అఖండ 2 సినిమాని నిత్యం వివాదాలు చుట్టుముడుతుండటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
  • డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా ఫైనాన్స్ సమస్యలతో వాయిదా పడింది.
  • తెలంగాణలో పెంచిన టికెట్ ధరలు, ప్రీమియర్లపై హైకోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది.
  • ఈ సమస్యల వెనుక కుట్ర ఉందా అని బాలయ్య అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల నిత్యం వివాదాలతో ఆలస్యం అవుతోంది. ఫైనాన్స్ సమస్యల నుండి టికెట్ ధరల కోర్టు తీర్పు వరకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇది సాధారణమేనా లేక బాలయ్యపై కక్ష కట్టారా అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

అఖండ 2 చుట్టూ వివాదాల సుడిగుండం

Akhanda 2: అఖండ 2 సినిమాని నిత్యం వివాదాలు చుట్టుముడుతో ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య లాంటి ఒక సీనియర్ స్టార్ హీరో సినిమాకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంటున్న సంఘటనల పట్ల ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సి ఉండేది. ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఫైనాన్స్ సమస్యలు చోటు చేసుకున్నాయి. డబ్బులు కట్టే వరకు సినిమా విడుదలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.

ఈ సమస్యను పరిష్కరించిన నిర్మాతలు ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ విడుదల చేయాలని భావించారు. ఈ తరుణంలోనే డిసెంబర్ 11వ తేదీ ప్రీమియర్లను ప్రసారం చేయాలని సిద్ధమయ్యారు. మరికొన్ని గంటలలో ప్రీమియర్లు ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు తెలంగాణలో పెంచిన టికెట్ ధరల పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఊహించని తీర్పు వెల్లడించింది. ఈ సినిమాకు పెంచిన టికెట్ ధరలను తగ్గిస్తూ అలాగే ప్రీమియర్లను కూడా క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడించారు.

విడుదలకు అడుగడుగునా అవాంతరాలు

ఇలా చివరి నిమిషంలో బాలకృష్ణ సినిమాకు ఊహించని షాక్ ఎదురవడంతో ఒక్కసారిగా చిత్ర బృందం, అభిమానులు తీవ్రస్థాయిలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బాలకృష్ణ సినిమాకే ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 సినిమాను చుట్టుముట్టిన ఈ సమస్యలని సర్వసాధారణంగానే చోటు చేసుకున్నాయా లేకపోతే ఈ వివాదాల వెనుక ఏదైనా కుట్ర, ప్రతికాల చర్యలు ఉన్నాయా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.

నిరాశలో బాలయ్య అభిమానులు..

బాలయ్యపై కక్ష కట్టారా? అభిమానుల ప్రశ్నలు

ఇలాంటి తరుణంలోనే కొంతమంది ఉద్దేశపూర్వకంగా బాలయ్య సినిమాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే ఈ సినిమాకు ఇలాంటి అవాంతరాలు తలెత్తుతున్నాయా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. ఇక కొంతమంది ఇటీవల బాలయ్య అభిమానులు ఈ సినిమా వాయిదా పడటంతో కచ్చితంగా ఈ సినిమా వాయిదా వెనుక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరొక హీరో ప్రమేయం కూడా ఉంది అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అఖండ 2 సినిమా పట్ల ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు అడుగడుగున నిరాశ ఎదురు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ప్రీమియర్లను నిలిపివేయడంతో గందరగోళం తలెత్తింది ప్రీమియర్ల కోసం అభిమానులు ఏకంగా 600 రూపాయల పెట్టి టికెట్ కొనుగోలు చేశారు. ఇలా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడటంతో ఈ డబ్బులను తిరిగి రీఫండ్ చేస్తారా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఇక కోర్టు తీర్పుతో చిత్ర నిర్మాతల స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది.

అఖండ 2 చుట్టూ ముసురుకున్న ఈ వివాదాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ సమస్యల వెనుక నిజమైన కారణాలు ఏమిటనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది, బాలకృష్ణ సినిమా భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.