|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రేకింగ్.. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు షాక్‌.. అఖండ 2 రిలీజ్ వాయిదా.. కొన్ని గంటల ముందు అనూహ్య నిర్ణయం.. ఇదే కార‌ణం

Published: 04-12-2025, 9:48 PM
బ్రేకింగ్.. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు షాక్‌.. అఖండ 2 రిలీజ్ వాయిదా.. కొన్ని గంటల ముందు అనూహ్య నిర్ణయం.. ఇదే కార‌ణం
  • నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
  • విడుదలకు కేవలం కొన్ని గంటల ముందు నిర్మాణ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
  • ఈ ప్రకటన బాలకృష్ణ అభిమానులకు తీవ్ర షాక్‌ను కలిగించింది.
  • 14 రీల్స్ ప్లస్ సంస్థ అనివార్య కారణాల వల్ల వాయిదా అని ప్రకటించింది.

నందమూరి బాలకృష్ణ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈరోజు విడుదల కావాల్సిన ‘అఖండ 2’ సినిమా వాయిదా పడింది. రిలీజ్‌కు కొన్ని గంటల ముందే నిర్మాణ సంస్థ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అనివార్య కారణాల వల్ల సినిమాను విడుదల చేయలేకపోతున్నట్లు ప్రకటించారు.

అఖండ 2 వాయిదా: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు షాక్

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గట్టి షాక్ తగిలింది. భారీ అంచనాలతో ఈ రోజు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన అఖండ 2 వాయిదా పడింది. సినిమా విడుదలను వాయిదా వేస్తూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

రిలీజ్‌కు కొన్ని గంటల ముందు అనూహ్య నిర్ణయం

డిసెంబర్ 5, శుక్రవారం.. నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు ఇది. కానీ ఈ అభిమానులకు గట్టి షాక్ తప్పలేదు. అఖండ 2 రిలీజ్ ను వాయిదా వేస్తూ విడుదలకు కొన్ని గంటల ముందు ప్రొడక్షన్ సంస్థ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోసల్ మీడియాలో 14 రీల్స్ ప్లస్ పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది.

నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటన

‘‘అనివార్య కారణాల వల్ల అఖండ 2ను షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయలేకపోతున్నామని బరువెక్కిన హృద‌యంతో మీకు చెప్పేందుకు చింతిస్తున్నాం. ఇది మాకు నొప్పి కలిగించే సందర్భం. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభిమాని నిరాశను మేం నిజంగా అర్థం చేసుకుంటున్నాం. త్వరలోనే సమస్యకు పరిష్కారం కనుక్కొంటాం. త్వరలోనే సానుకూల అప్ డేట్ ను పంచుకుంటాం’’ అని 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ అర్ధరాత్రి ట్వీట్ చేసింది.

అఖండ 2 వాయిదాపై నిర్మాణ సంస్థ బరువెక్కిన హృద‌యంతో అభిమానులకు క్షమాపణలు చెప్పింది. త్వరలోనే సమస్యకు పరిష్కారం కనుగొని, సానుకూల అప్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అభిమానులు తదుపరి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.