|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీకాంత్ ‘జైలర్ 2’ సునామీ! బాక్సాఫీస్ షేక్, రైట్స్ కోసం రచ్చ రచ్చ!

Published: 07-07-2026, 5:48 PM
రజనీకాంత్ 'జైలర్ 2' సునామీ! బాక్సాఫీస్ షేక్, రైట్స్ కోసం రచ్చ రచ్చ!
  • ‘జైలర్ 2’ థియేట్రికల్ రైట్స్ కోసం మలయాళ మార్కెట్‌లో ఊహించని డిమాండ్.
  • మొదటి భాగం భారీ విజయం, మోహన్‌లాల్ పవర్‌ఫుల్ పాత్రతో అంచనాలు ఆకాశానికి.
  • రజనీకాంత్, మోహన్‌లాల్ కాంబినేషన్ క్రేజ్ సీక్వెల్ బిజినెస్‌కు కొండంత బలం.
  • సౌత్ ఇండియా వ్యాప్తంగా పంపిణీ హక్కుల కోసం ప్రముఖ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పండగ వాతావరణం! ‘జైలర్ 2’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. థియేట్రికల్ రైట్స్ కోసం రికార్డు స్థాయి డిమాండ్‌తో, ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. తలైవా మ్యాజిక్ కోసం సిద్ధంగా ఉండండి!

కేరళ మార్కెట్‌లో ‘జైలర్ 2’ సృష్టించిన సునామీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, హిందీ బెల్ట్‌లలో కాసుల వర్షం కురిపించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, మలయాళ మార్కెట్‌లోనూ అనూహ్యమైన రికార్డులను నమోదు చేసింది. రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ బ్లాక్‌బస్టర్‌కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘ జైలర్ 2 ‘ సిద్ధమవుతోంది. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు, సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. కేరళ మార్కెట్‌లో భారీ డిమాండ్ ‘జైలర్ 2’ వెండితెరపైకి రావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం మలయాళ చిత్ర పరిశ్రమలో అప్పుడే భారీ పోటీ మొదలైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా కేరళలోని ప్రముఖ పంపిణీ సంస్థలు ఈ క్రేజీ సీక్వెల్ రైట్స్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయట. మొదటి భాగం కేరళ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడం, దానికి తోడు మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ ‘మాథ్యూ’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించి అక్కడి ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించడమే ఈ రేంజ్ డిమాండ్‌కు ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. * మూడు రాచ కుటుంబాలకు వారసురాలు, స్టార్ హీరోయిన్.. ఒక్క వీడియోతో జీవితం తల్లకిందులు అంచనాలు పెంచుతున్న అండర్‌వరల్డ్ కనెక్షన్ తొలి భాగంలో మోహన్‌లాల్ పోషించిన గెస్ట్ రోల్‌కు ఆడియన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ‘జైలర్ 2’లో కూడా ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా, కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతోందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, రజనీకాంత్ – మోహన్‌లాల్ కాంబినేషన్ క్రేజ్ మలయాళ మార్కెట్‌లో ఈ సీక్వెల్ బిజినెస్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది. దక్షిణాది వ్యాప్తంగా ఈ చిత్రం పంపిణీ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. అయితే ఈ బిజినెస్ డీల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. * రోడ్డు మీద సిగరెట్ పీకలు ఏరుకుని తాగేవాడు – ఆకలి, అవమానాలే ఆయన్ని సూపర్‌స్టార్‌ని చేశాయ్ దసరా బరిలో సూపర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దసరా పండుగ సెలవులను టార్గెట్ చేస్తూ ఈ ఏడాది అక్టోబర్ 15న ‘జైలర్ 2’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

మోహన్‌లాల్ పవర్ ప్యాక్డ్ రోల్.. అంచనాలకు మించి!

సౌత్ ఇండియాలో రైట్స్ కోసం తీవ్ర పోటీ!

‘జైలర్ 2’పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రజనీకాంత్, నెల్సన్ మాయాజాలం కోసం వేచి చూడండి! మరిన్ని అప్‌డేట్‌ల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.