|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

CM విజయ్ సంచలన నిర్ణయం! సొంత సినిమాకే షాకింగ్ రూల్స్.. అసలు కారణం ఇదే!

Published: 08-07-2026, 2:20 AM
CM విజయ్ సంచలన నిర్ణయం! సొంత సినిమాకే షాకింగ్ రూల్స్.. అసలు కారణం ఇదే!
  • CM విజయ్ సొంత సినిమా ‘జననాయగాన్’ రిలీజ్ పై సంచలన నిర్ణయం.
  • టికెట్ల అధిక ధరలపై నిఘా: థియేటర్లకు సీఎం విజయ్ కఠిన హెచ్చరిక.
  • అవినీతి ఆరోపణలు నివారించేందుకే విజయ్ ఈ కఠిన రూల్స్ విధించారు.
  • జననాయగాన్ జులై రిలీజ్ కు రంగం సిద్ధం, ఉత్కంఠగా మారిన విడుదల.

తమిళనాడు సీఎం విజయ్ తన చివరి సినిమా ‘జననాయగాన్’ రిలీజ్‌కు సంబంధించి షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. సొంత సినిమాపైనే కఠిన నిబంధనలు విధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంచలన వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ!

CM విజయ్ కఠిన నిర్ణయం వెనుక అసలు కథ!

CM Vijay : తమ సినిమా రిలీజ్ అవుతుంటే ఏ రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ చేస్తారు హీరోలు. ప్రమోషన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. స్టార్ హీరోలు ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నా సినిమా రిలీజ్ విషయంలో వెనకుండి అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు. అయితే తమిళనాడు సీఎం తన చివరి సినిమా రిలీజ్ విషయంలో కఠినంగా ఉన్నారట.

తమిళనాడు స్టార్ హీరో విజయ్ సీఎం అవకముందు తన చివరి సినిమాగా జననాయగాన్ తీశారు. ఈ సినిమా ఎప్పట్నుంచో రిలీజ్ అవ్వకుండా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు విజయ్ సీఎం అయినా ఈ సినిమా రిలీజ్ కష్టంగానే ఉంది. అదిగో ఇదిగో అని ఏదో ఒక డేట్ జననాయగాన్ రిలీజ్ అని చెప్తున్నారు కానీ అది జరగట్లేదు. తాజాగా జననాయగాన్ సినిమా జులైలో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

‘జననాయగాన్’ రిలీజ్‌కు కొత్త చిక్కులు!

అయితే రిలీజ్ ఎప్పుడైనా కానీ జననాయగాన్ విషయంలో సీఎం విజయ్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియా సమాచారం. విజయ్ ని దెబ్బ తీయడానికి ఆయన ప్రత్యర్థులు జననాయగాన్ సినిమాని వాడుకోవాలని చూస్తున్నారట. ఈ సినిమాకు బ్లాక్ లో టికెట్లు అమ్మినా, టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మినా విజయ్ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి రెడీగా ఉన్నారట.

థియేటర్లకు షాకింగ్ వార్నింగ్.. లైసెన్సులు రద్దు!

ఇది ముందే తెలుసుకున్న విజయ్ గట్టి నిఘా చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని, అనుమతించిన ధరల కంటే టికెట్లను ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా థియేటర్ లైసెన్సులను రద్దు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జననాయగాన్ రిలీజ్ మరింత ఆసక్తిగా మారింది.

సీఎం విజయ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ‘జననాయగాన్’ రిలీజ్ పై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ సినిమా ఎలా రిలీజ్ అవుతుంది, ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.