|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సౌందర్యపై సంచలన డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్! పెళ్లి తర్వాత గాడి తప్పింది.. కర్మ వదలదు! వైర్ల్ అవుతున్న నిజాలు!

Published: 08-07-2026, 2:21 AM
సౌందర్యపై సంచలన డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్! పెళ్లి తర్వాత గాడి తప్పింది.. కర్మ వదలదు! వైర్ల్ అవుతున్న నిజాలు!
  • సౌందర్య జీవితంపై సంచలన దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
  • పెళ్లి తర్వాత సౌందర్య గాడి తప్పిందని, తప్పులు చేసిందని డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్ చేశారు.
  • జగపతిబాబు, వెంకటేష్‌లతో రూమర్డ్ ఎఫైర్స్‌పై గీతా కృష్ణ కొత్త కోణాన్ని బయటపెట్టారు.
  • కర్మ ఎవరినీ వదలదని సౌందర్య విషాద ముగింపును ప్రస్తావించిన డైరెక్టర్ వ్యాఖ్యలు సంచలనం.

టాలీవుడ్ దివంగత నటి సౌందర్య గురించి సంచలన దర్శకుడు గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై ఆయన చేసిన బోల్డ్ కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి!

సంచలన దర్శకుడు గీతా కృష్ణ ఏమన్నారంటే?

సౌందర్య పేరు చెబితే మనకు ఆమె అద్భుతమైన నటన, ఆమె చీరకట్టు, సాంప్రదాయానికి ఆమె వేసిన పెద్ద పీఠ గుర్తుకొస్తాయి. అన్నింటికి మించి మంచి నటనతో మనల్ని అలరించిన తీరు గుర్తొస్తుంది. ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినా సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో తన సినిమాలతో పదిలంగానే ఉంది. సౌందర్య గ్రీన్‌ యాక్ట్రెస్‌. కాలంతో సంబంధం లేకుండా, అన్ని జనరేషన్‌ ఆడియెన్స్ ఆమెని ఆరాధిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి తరం కూడా ఆమె సినిమాలు చూశారంటే ఫిదా అవ్వాల్సిందే.

అంతగా ఆకట్టుకున్నా, తన సినిమాలతో అలరిస్తూనే ఉన్న సౌందర్య గురించి కొన్ని షాకింగ్‌ నిజాలు బయటకు వచ్చాయి. ఆమె కెరీర్‌ చివర్లో చేసిన తప్పులు ఇప్పుడు షాకిస్తున్నాయి. సౌందర్య 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలీకాఫ్టర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బీజేపీ కోసం ఆమె ప్రచారం చేసింది. అయితే రెండు, మూడు లక్షలకు కక్కుర్తి పడి ఆమె తన ప్రాణాలు తీసుకుందని ఇటీవల ప్రముఖ సంచలన దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఇప్పుడు ఆయన మరో సంచలన, షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. సౌందర్య గురించి ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి వార్త విని ఉండరంటే అతిశయోక్తి కాదు.

పెళ్లి తర్వాత సౌందర్య గాడి తప్పిందా? షాకింగ్ నిజాలు!

సౌందర్యకి సంబంధించి ఇతర హీరోలతో ఎఫైర్‌ రూమర్స్ వచ్చాయి. ప్రధానంగా జగపతిబాబు, వెంకటేష్‌తో వినిపించాయి. జగపతిబాబుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని, ఆయన ఆమెతో పిల్లల్ని కనాలనుకున్నారనే వార్త వైరల్‌ అయ్యింది. దీనిపై జగపతిబాబు చాలా సార్లు స్పందించారు. అందులో నిజం లేదని, ఆమె మంచి స్నేహితురాలు అని, వారి ఫ్యామిలీతోనూ తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అదే సమయంలో వెంకటేష్‌ని కూడా సౌందర్య మ్యారేజ్‌ చేసుకోవాలనుకుందని, రామానాయుడు బెదిరించారనే మరో రూమర్‌ కూడా ఉంది. వీటిలో నిజాలేంటనేది తెలియదు.

కానీ గీతా కృష్ణ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. సౌందర్య పెళ్లి తర్వాత గాడి తప్పిందని షాకిచ్చాడు. ఒక్కటి కాదు రెండు కాదు చాలా తప్పులు చేసిందని, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లిందన్నారు. `శ్రీరాములయ్య` సినిమా చేశాక ఆమె గాడి తప్పిందని ఆయన కామెంట్‌ చేశారు. ఆ రాజకీయ నాయకుడు కూడా సౌందర్యని ఇబ్బంది పెట్టినట్టు ఆయన వెల్లడించారు. ఇలా సౌందర్య కెరీర్‌ గాడి తప్పిందన్నారు. కర్మ ఎవరిని వదలదు అంటారుగా, సౌందర్య విషయంలోనూ అదే జరిగిందేమో అంటూ ఆయన షాకిచ్చాడు.

కర్మ సిద్ధాంతం సౌందర్య జీవితంలో నిజమైందా?

సౌందర్య చాలా మంచి అమ్మాయి అని, మంచి నటి అని, ఆమెతో సినిమా చేయకపోవడం తన దురదృష్టం అని, కానీ ఆమె నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. వెంకటేష్‌తో మంచి మంచి సినిమాలు చేసిందని, సహజమైన అందం ఆమె సొంతమని వెల్లడించారు. ఆమెని చూస్తే మనింటి అమ్మాయిలా, మన పక్కింటి అమ్మాయిలా ఉంటుందని తెలిపారు. ఆమె ఇప్పుడు లేకపోవడం ఇండస్ట్రీకి పెద్ద లోటు అని ఆయన వెల్లడించడం విశేషం.

సౌందర్య జీవితంపై గీతా కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. టాలీవుడ్ చరిత్రలో ఒక గొప్ప నటిగా నిలిచిన సౌందర్య గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.