
📌 Key Points
- SIR-2002 ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ తెలంగాణలో వేగంగా సాగుతోంది.
- మీ తల్లిదండ్రులు, తాతల ఓటరు వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.
- తెలంగాణ సీఈఓ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పాత ఓటర్ల రికార్డులను డిజిటల్‌గా శోధించవచ్చు.
- ఓటరు గుర్తింపు కార్డు నంబరుతో లేదా ఇతర వివరాలతో ఓటు సమాచారం పొందడానికి రెండు పద్ధతులున్నాయి.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, తమ పూర్వీకుల ఓటు వివరాలను ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది.
SIR-2002 ఓటర్ల జాబితా ప్రాముఖ్యత
SIR Telangana : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రతి ఓటరు తమ వివరాలను పాత రికార్డులతో సరిచూసుకోవడం ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల జాబితాలో (SIR-2002) మీ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రజల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కార్యాలయం ఒక సులభమైన ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేసే తెలంగాణ సీఈఓ కార్యాలయం, పాత రికార్డులను శోధించే ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. దీంతో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లో వివరాలను పొందొచ్చు.
ఎస్ఐఆర్ – 2002 రికార్డులను తెలుసుకోవడానికి అభ్యర్థులు ముందుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక వెబ్‌సైట్ ( https://ceotelangana.nic.in ) ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలోనే ఓటర్ల వివరాల శోధనకు సంబంధించిన ప్రత్యేక లింక్ డిస్ ప్లే అవుతుంది.
ఆన్‌లైన్‌లో ఓటు వివరాలు తెలుసుకునే విధానం
వెబ్‌సైట్‌లో ఓటర్ల పాత వివరాలను శోధించడానికి అధికారులు రెండు రకాల ఆప్షన్లను కల్పించారు. అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి కింది వాటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు.
మీ వద్ద ఓటరు గుర్తింపు కార్డు నంబరు లేనప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
ఓటరు గుర్తింపు కార్డు నంబరు అందుబాటులో ఉంటే ఈ పద్ధతి ద్వారా చాలా వేగంగా ఖచ్చితమైన వివరాలను పొందవచ్చు.
ఓటరు గుర్తింపు కార్డు నంబరుతో శోధన
మీరు సెర్చ్ బటన్ నొక్కగానే SIR – 2002 డేటాబేస్ నుంచి వెతికి, పూర్తి వివరాలను సిస్టమ్ స్క్రీన్‌పై చూపిస్తుంది. అందులో ఓటరు పేరు , కుటుంబ సభ్యుడితో ఉన్న సంబంధం, ఎస్ఐఆర్-2002 జాబితాలో పేరు ఉందో లేదో తెలిపే స్టేటస్ తో పాటు వారి ఓటరు కార్డు నంబరు స్పష్టంగా కనిపిస్తాయి.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
తెలంగాణ సీఈఓ కార్యాలయం చేపట్టిన ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రజలకు పాత ఓటర్ల రికార్డులను సులభంగా యాక్సెస్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంటి నుంచే తమ పూర్వీకుల ఓటు వివరాలను తెలుసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుంది, పారదర్శకత పెరుగుతుంది.

