|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోడీ-ఇరాన్ సుప్రీం భేటీ: యుద్ధ వేళ వైరల్ అవుతున్న ట్వీట్ కలకలం!

Published: 03-03-2026, 2:35 PM
మోడీ-ఇరాన్ సుప్రీం భేటీ: యుద్ధ వేళ వైరల్ అవుతున్న ట్వీట్ కలకలం!
  • ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం, గల్ఫ్ దేశాల్లో భారతీయుల ఇబ్బందులు.
  • ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా ప్రకటన.
  • 2016లో ప్రధాని మోడీ ఇరాన్ పర్యటనలో అయతుల్లా అలీ ఖమేనీతో సమావేశం కావడం, ఆనాటి ట్వీట్ వైరల్.
  • చాబహార్ ఓడరేవు ఒప్పందంతో పాటు వాణిజ్యం, ఇంధనంపై భారత్-ఇరాన్ మధ్య 12 ద్వైపాక్షిక ఒప్పందాలు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోడీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో దిగిన ఫోటో వైరల్ అవుతోంది. 2016లో మోడీ ఇరాన్ పర్యటన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఆనాటి ఖమేనీ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

యుద్ధ సమయంలో వైరల్ అవుతున్న మోడీ-ఖమేనీ ఫోటో

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ – అమెరికా దేశాల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మూడు దేశాల సైనికులు మరణించారు. ఇజ్రాయెల్-అమెరికాపై ఉన్న కోపంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ సంఘటనలో కూడా సామాన్యులు మరణిస్తున్నారు. ముఖ్యంగా గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న‌మ‌న భార‌తీయులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ( Ayatollah Ali Khamenei ) మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు ఇప్పటికే ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, అయతుల్లా అలీ ఖమేనీ ఫోటో వైరల్ గా మారింది.

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, అయతుల్లా అలీ ఖమేనీ ఇద్దరు సమావేశం అయిన ఫోటో వైరల్ గా మారింది. 2016లో ఇరాన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ (PM narendra modi ) వెళ్లారు. ఆ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో మోడీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంపై అప్పట్లో అయతుల్లా అలీ ఖమేనీ ( Ayatollah Ali Khamenei ) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. యుద్ధం సమయంలో ఇరాన్ కు ఇండియా సపోర్ట్ చేస్తుందన్న ప్రచారం తెరపైకి వస్తుందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

2016లో ఇరాన్ పర్యటనలో మోడీ

దాదాపు పది సంవత్సరాల కిందట 2016 స‌మ‌యంలో ఇరాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా జరిగాయి. ఇందులో మొదటిది చాబహార్ ఓడరేవు ఒప్పందం. పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ దేశాలకు ఇటు ఇండియా చేరుకోవడానికి ఒక వ్యూహాత్మక మార్గం ఏర్పాటు చేయ‌డం ల‌క్ష్యం. దీని కోసం 500 డాలర్ల మిలియన్లు పెట్టుబడిగా ఇస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. వాణిజ్యం, ఇంధనం, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయి.

భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు

మొత్తంగా అప్పట్లో ఇరాన్, భారత్ మధ్య 12 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ 2016 సంవత్సరంలో ఇరాన్ పర్యటనకు వెళ్లారు. 2016 సంవత్సరం మే 22, 23 తేదీలలో అధికారికంగా ఇరాన్ దేశంలో పర్యటించారు. మొదట టెహ్రాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ… 2016 మే 22వ తేదీన గురుద్వార్ కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్స్ తో స్పెషల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక 2016 మే 23వ తేదీన ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ తో సమావేశమయ్యారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో, ట్వీట్ భారత్-ఇరాన్ సంబంధాలపై అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి. అయితే, గత ఒప్పందాలు రెండు దేశాల మధ్య సత్సంబంధాలను సూచిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.