|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్ల సునామీ! పవన్ కళ్యాణ్ స్టామినాకు బాక్సాఫీస్ షాక్!

Published: 23-03-2026, 1:35 AM
ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్ల సునామీ! పవన్ కళ్యాణ్ స్టామినాకు బాక్సాఫీస్ షాక్!
  • ఉగాది కానుకగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ.
  • నాలుగు రోజుల్లో రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఉస్తాద్ భగత్ సింగ్.
  • పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలైన మూడవ సినిమా ఇది.
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన చిత్రం.

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కలెక్షన్ల గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు సాధించినప్పటికీ, తరువాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. పూర్తి వివరాలు చూద్దాం!

ఉస్తాద్ భగత్ సింగ్: మొదటి రోజు వసూళ్లు ఎంత?

ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన ఒక స్పష్టమైన విషయం కనిపిస్తోంది. బాక్సాఫీసు ట్రెండ్‌ మారిపోయింది. హీరో ఎవరైనా సరే, కంటెంట్‌ ఉంటే ఆడుతుంది, లేదంటే రెండో రోజు నుంచే పడిపోతుంది. స్టార్‌ హీరో క్రేజ్‌ మొదటి రోజుకే పరిమితమవుతుంది. రెండో రోజు నుంచే ప్రభావం తెలిసిపోతుంది. అందుకు ప్రభాస్‌ అయినా, పవన్‌ కళ్యాణ్‌ అయినా, బాలకృష్ణ అయినా సేమ్‌ రిజల్ట్. మొన్న ప్రభాస్‌ `ది రాజా సాబ్‌` విషయంలో అదే జరిగింది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` విషయంలోనూ అదే జరుగుతుంది.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ ఉగాది సందర్భంగా విడుదలయ్యింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మించారు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మూడో చిత్రమిది. అంతకు ముందు గతేడాది `హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో `హరి హర వీరమల్లు` మూవీ డిజాస్టర్‌ గా నిలవగా, `ఓజీ` బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. పవన్‌కి సాలిడ్‌ మూవీ పడితే అది ఏ స్థాయిలో బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుందో ఈ మూవీ నిరూపించింది.

నాలుగు రోజుల్లో కలెక్షన్ల వివరాలు

ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో అలరిస్తున్నారు పవన్‌. 9 నెలల్లో ఆయన్నుంచి మూడు సినిమాలు విడుదల కావడం రికార్డ్ గా చెప్పొచ్చు. అయితే ఈ మూడు సినిమాలు నాలుగైదు ఏళ్ల క్రితమే కమిట్‌ అయిన మూవీస్‌ కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీకి ఆదరణ ఎలా ఉంది? కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే. ఈ మూవీ క్రమంగా డల్‌ అవుతుంది. మొదటి రోజు భారీగానే వసూలు చేసింది. కానీ ఆ తర్వాతి రోజు నుంచి పడిపోతూ వస్తోంది.

ప్రస్తుతం మొదటి వారాంతం ముగిసింది. నాలుగు రోజుల్లో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాకి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.82కోట్లు వసూలు చేసిందని సమాచారం. టైమ్స్ ఆఫ్‌ ఇండియా ఈ లెక్కలను వెల్లడించింది. నాల్గో రోజు ఈ సినిమాకి దాదాపు ఎనిమిది కోట్ల వరకు గ్రాస్‌ వచ్చినట్టు తెలిపింది. ఇది చాలా డల్‌ కలెక్షన్లు అని చెప్పొచ్చు. నాలుగు రోజుల్లో కనీసం వంద కోట్లకు కూడా చేరలేకపోయింది. పవన్‌ కళ్యాణ్‌ లాంటి సినిమాకి ఇంత డల్‌గా, ఇంతటి తక్కువ వసూళ్లు ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమాకి ఇది నిరాశేనా?

రెండో వారం కూడా ఈ సినిమాకి కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ వారం కూడా చాలా వరకు హాలీడేస్‌ ఉన్నాయి. శ్రీరామ నవమి ఉంది. ఆ తర్వాత వీకెండ్‌ కలిసి వస్తుంది. మరి ఈ సెలవులను ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ ఏమాత్రం క్యాష్‌ చేసుకుంటుందనేది చూద్దాం. ఈ మూవీకి సుమారు రూ.150కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి రూ.123కోట్ల బిజినెస్‌ అయ్యిందట. ఇంకా రూ.150కోట్లకుపైగా వసూళ్లని రాబడితేనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. లేదంటే బయ్యర్లకి నష్టాలకు తప్పవు. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాతలు సేఫ్‌లోనే ఉన్నట్టు సమాచారం. సేఫ్‌ మాత్రమే కాదు, భారీగా లాభాలు వచ్చాయట.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్ల గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. పవన్ కళ్యాణ్ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.