
📌 Key Points
- ఈరోస్ సంస్థతో ఆర్థిక వివాదం కారణంగా అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది.
- మద్రాస్ హైకోర్టు అఖండ 2 విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- డిసెంబర్ 12న సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
- ఓవర్సీస్ రిలీజ్ ప్లానింగ్ విషయంలో ఇంకా సమస్యలున్నాయి.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం రిలీజ్ విషయంలో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈరోస్ సంస్థతో నెలకొన్న ఆర్థిక వివాదాలు పరిష్కారం కావడంతో, మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12న రిలీజ్ ఖాయంగా కనిపిస్తోంది.
అఖండ 2 రిలీజ్ వాయిదాకు కారణం
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విషయంలో అభిమానుల తో పాటు ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. మరి కొన్ని నిమిషాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయి అనగా చిత్ర యూనిట్ సినిమాని వాయిదా వేసింది. ఉన్నపళంగా ప్రీమియర్ షోలు, సినిమా రిలీజ్ రద్దయ్యాయి. దీనితో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈరోస్ సంస్థతో 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది.
అఖండ 2 రిలీజ్ ని అడ్డుకుంటూ ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనితో వారికి అనుకూలంగా అఖండ 2 రిలీజ్ ని ఆపివేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు సమస్యని పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డిసెంబర్ 5 నుంచి నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి 14 రీల్స్ ప్లస్ నిర్మాతల కృషి ఫలించింది.
మద్రాస్ హైకోర్టు తీర్పు: గ్రీన్ సిగ్నల్
మద్రాస్ హై కోర్టు అఖండ 2 రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుతున్న సమాచారం మేరకు అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు, బయ్యర్ల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయాయి కాబట్టి డిసెంబర్ 12నే సినిమాని రిలీజ్ చేయాలని అంటున్నారు.
డిసెంబర్ 12 రిలీజ్ డేట్ ని త్వరలోనే 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఒక్క సమస్య ఉంది. డిసెంబర్ 5న రిలీజ్ కావలసిన అఖండ 2 వాయిదా పడడంతో ఓవర్సీస్ రిలీజ్ గందరగోళంగా మారింది. ఇప్పుడు డిసెంబర్ 12న రిలీజ్ అంటే 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపే అక్కడ మళ్ళీ థియేటర్లు వెతుక్కోవాలి. రిలీజ్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.
మిగిలిన ఒకే ఒక్క సమస్య: ఓవర్సీస్
ఇది మినహాయిస్తే అఖండ 2 డిసెంబర్ 12న రిలీజ్ కావడానికి అంతా సిద్ధం అని చెప్పొచ్చు. దీనితో నిర్మాతలు మరోసారి అదనపు టికెట్ ధరల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. 11 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు కూడా ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి అఖండ 2 విడుదల అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి. ఓవర్సీస్ పంపిణీ సమస్యను పరిష్కరిస్తే, డిసెంబర్ 12న బాలయ్య అభిమానులకు పండుగే. సినిమా అదనపు ధరలు, ప్రీమియర్ షోల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.


