|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Movie Release: అఖండ-2 మూవీ రిలీజ్‌ డేట్.. ఆ రోజైనా వచ్చేనా?

Published: 04-09-2025, 10:19 AM
Akhanda 2 Movie Release: అఖండ-2 మూవీ రిలీజ్‌ డేట్.. ఆ రోజైనా వచ్చేనా?

2021లో విడుదలై సూపర్ హిట్ అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. టీజర్ విడుదల తర్వాత రిలీజ్ వాయిదా పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Key Points

1

అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

2

జూన్ లో టీజర్ విడుదలైంది, కానీ రిలీజ్ వాయిదా పడింది.

4

డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అవుతుందని బాలకృష్ణ హింట్ ఇచ్చారు.

అఖండ 2 రిలీజ్ వాయిదా ఎందుకు?

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ’. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు . అయితే ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది . పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ ‍ సినిమా కోసం అఖండ -2 ను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది .

దీంతో బాలయ్య సినిమా ఇంకెప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు . వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా అంతకుముందే డిసెంబర్ ‌ లోనే రానుందా అని ఫ్యాన్స్ ‌ తో పాటు ప్రేక్షకులు తెగ కన్ ‌ ఫ్యూజ్ అవుతున్నారు . అఖండ -2 విడుదల తేదీని ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు .

డిసెంబర్ లో విడుదల అవుతుందా?

బాలకృష్ణ హింట్ ఏమిటి?

తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ మూవీ రిలీజ్ ‌ డేట్ ‌ పై హింట్ ఇచ్చేశారు . డిసెంబర్ తొలివారంలోనే అఖండ -2 రానుందని చెప్పేశారు . అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు . ఈ లెక్కన డిసెంబర్ 5 న శుక్రవారం కావడంతో అదే రోజు రిలీజ్ కావొచ్చని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు . ఆ రోజైనా రిలీజవుతుందా ? లేదంటే సంక్రాంతికి పోస్ట్ ‌ పోన్ ‌ అవుతుందా ? అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది .

అఖండ 2 విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. డిసెంబర్ మొదటి వారం అవకాశం ఉందని బాలయ్య హింట్ ఇవ్వడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరి నిర్ణయం మేకర్స్ ద్వారానే వెల్లడి అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.