
📌 Key Points
- అఖండ 2 విడుదల తేదీపై వచ్చిన రూమర్లను నిర్మాతలు ఖండించారు.
- డిసెంబర్ 5న రావాల్సిన సినిమా, ఆర్థిక లావాదేవీల వల్ల వాయిదా పడి, ఇప్పుడు సిద్ధంగా ఉంది.
- టికెట్ రేట్లు, ప్రీమియర్ షోల రద్దు వార్తలను నిర్మాత రామ్ అచంట ట్విట్టర్ ద్వారా ఖండించారు.
- బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్, కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ 2’ విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే, టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల రద్దు వంటి రూమర్లను నిర్మాతలు ఖండించి, అభిమానులకు స్పష్టతనిచ్చారు.
అఖండ 2 విడుదల సందిగ్ధతకు తెర
Akhanda 2 : బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ సినిమా అంటేనే మామూలుగా అంచనాలు ఉంటాయి. అటువంటిది అఖండ సినిమాకు సీక్వెల్ అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగువ సినిమా అఖండ 2. డిసెంబర్ 5నే రిలీజ్ అయి విధ్వంసం సృష్టించాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో కొన్ని లావాదేవీల కారణంగా వాయిదా పడిపోయింది.
ఎవరు ఊహించని విధంగా 11 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక విషయాలను ఇన్వాల్వ్ చేస్తూ అఖండ సినిమా రిలీజ్ కు అడ్డుపడింది ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ. మొత్తానికి వాటన్నిటిని దాటుకొని లోకల్ ఫైనాన్సర్లకు కూడా క్లియర్ చేస్తూ రేపు ప్రేక్షకులు ముందుకు రావడానికి ఈ సినిమా సిద్ధం అవుతుంది. ఈ తరుణంలో పోకిరి రేంజ్ లో ఒక ట్విస్ట్ వచ్చి పడింది. ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లకు హైక్ దొరకలేదని, ప్రీమియర్ షోలు నేడు కూడా క్యాన్సిల్ అవ్వబోతున్నాయని వార్తలు వినిపిస్తూ వచ్చాయి వాటన్నిటికీ నిర్మాతలు చెక్ పెట్టారు.
ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లు ఏవి నమ్మవద్దు అని. థియేటర్లో తాండవం ఎంజాయ్ చేయండి అని స్వయంగా నిర్మాత రామ్ అచంట ట్విట్టర్ వేదికగా అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇప్పుడే విపరీతంగా పోస్టులు మొదలయ్యాయి.
రూమర్లపై నిర్మాతల వివరణ
షోలు క్యాన్సిల్ అవుతున్నాయి అనగానే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొంతమంది లబోదిబోమన్నారు. మొత్తానికి వాటన్నిటికీ కూడా అధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందో వేచి చూడాలి. సినిమాకి పాజిటివ్ టాక్ అయితే ఆల్రెడీ మొదలైపోయింది ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. ప్రేక్షకులు కూడా కంప్లీట్ నమ్మకంతో సినిమా ధియేటర్ కి వెళ్తున్నారు.
Doubts yemi pettukovadhhu brother.. no issues. #Akhanda2 BOXOFFICE VIDHWAMSAM ENJOY CHEYYANDI https://t.co/xNQAt3RUoI
— raam achanta (@RaamAchanta) December 11, 2025
అంచనాలు పెంచుతున్న కాంబినేషన్
మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకునేలా ఉంది. ప్రతిసారి అభిమానులను సప్రైజ్ చేయటానికి బోయపాటి శ్రీను ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మూడు టీజర్లు ఒక ట్రైలర్ విడుదలైంది. పాటలు విషయాన్నీ పక్కన పెట్టేస్తే ఈ వీడియో కంటెంట్ మాత్రం అద్భుతమైన హైప్ క్రియేట్ చేసింది.
ఇక నిన్న రిలీజ్ చేసిన రిలీజ్ టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బోయపాటి శ్రీను తీసిన కొన్ని షాట్స్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఆ టీజర్ చూస్తేనే ప్రేక్షకులు పోతారేమో అని ఫీల్ క్రియేట్ అయింది. ఇక సాయంత్రం థియేటర్లో ఎలా ఉండబోతుందో చూడాలి.
మొత్తానికి, ‘అఖండ 2’ సినిమా విడుదలపై నెలకొన్న అన్ని సందేహాలకు నిర్మాతలు పుల్‌స్టాప్ పెట్టారు. బాలకృష్ణ విధ్వంసం చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాలి.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online