
📌 Key Points
- అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- 14 రీల్స్ సంస్థ క్షమాపణలు తెలుపుతూ అధికారిక నోట్ విడుదల చేసింది.
- ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా అని నిర్మాత సురేష్ బాబు స్పష్టం చేశారు.
- కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు, సంక్రాంతిపై సందిగ్ధత.
బాలకృష్ణ అఖండ 2 విడుదల వాయిదా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు తీవ్ర నిరాశలో ఉండగా, 14 రీల్స్ సంస్థ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనూహ్యంగా సినిమా వాయిదా పడటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
అఖండ 2 వాయిదా: అభిమానుల ఆగ్రహం!
Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 పోస్ట్ పోన్ అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల అవుతుంది అను అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ అనూహ్యంగా వాయిదా పడటం చర్చనీయాంశం అయ్యింది. నందమూరి అభిమానులు ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అసలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా అలా ఎలా చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ విషయంపై బాలకృష్ణ కూడా కోపంగా ఉన్నారని సమాచారం. ఇక వాయిదా తరువాత రిలీజ్ ఎప్పుడు ఉంటుందని అందరు ఎదుచూస్తున్న తరుణంలో మేకర్స్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది.
Akhanda 2-RajaSaab: అఖండ 2 బాటలోనే రాజాసాబ్?.. సంక్రాంతికి రిలీజ్ కష్టమేనా?.. ఆందోళనలో ఫ్యాన్స్..
14 రీల్స్ అఫిషియల్ ప్రకటన: అసలు కారణమేంటి?
తమ సోషల్ మీడియాలో నోట్ విడుదల చేశారు. “అఖండ2(Akhanda 2) ని థియేటర్స్ కి తీసుకురావడానికి మా ప్రయత్నం చేశాము. కానీ, కొన్నిసార్లు ఊహించని విషయాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, సినీ ప్రేమికులకు మేము క్షమాపణలు చెప్తున్నాం. ఈ పరిస్థితులలో మాకు తోడుగా ఉన్నందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు కృతజ్ఞులు. అఖండ 2 ఎప్పడు వచ్చినా గురి సూపర్ హిట్ అవుతుంది. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? సంక్రాంతి బరిలో ఉంటుందా?
అయితే, మేకర్స్ విడుదల చేసిన ఈ కొత్త నోట్ తో అభిమానుల్లో మరో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. అసలు సినిమా విడుదల ఇప్పుడు ఉంటుందా.. లేదా. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని చెప్పారంటే మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నారా అనే టాక్ నడుస్తోంది. ఇక అఖండ 2 మేకర్స్ ఆర్థిక లావాదేవీల విషయంలో ఇండస్ట్రీ పెద్దల మధ్య చర్చలు జరిగాయని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చెప్పారు. దాంతో, ఈ వివాదం సద్దుమణుగుతుంది. సాయంత్రం విడుదల అవుతుంది సినిమా అని అనుకున్నారు అంతా. కానీ, మేకర్స్ ప్రకటనతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. కాబట్టి, అఖండ 2 సినిమా మరోసారి వాయిదా పడింది అనుకోవడమే ఇక. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు. అందరు అనుకుంటున్నట్టుగానే సంక్రాంతి బరిలో దించుతారా అనేది చూడాలి.
అఖండ 2 మరోసారి వాయిదా పడటంతో, కొత్త విడుదల తేదీపై ఉత్కంఠ నెలకొంది. మేకర్స్ త్వరలో డేట్ ప్రకటిస్తామని తెలిపారు. సంక్రాంతి బరిలో సినిమా ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.


