
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సూపర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 రిలీజ్ వాయిదా వేశారు. సెప్టెంబర్ 25 విడుదల తేదీని వాయిదా వేయడం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది.
Key Points
అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది.
సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడ్డట్లు ప్రకటన.
వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్ పనుల కోసం వాయిదా వేశారని ప్రకటన.
పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాతో డేట్ డికేషన్ కారణమేనా అన్న చర్చ.
అఖండ 2 రిలీజ్ వాయిదా
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ’ . 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది . దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా అఖండ -2 ను తెరకెక్కిస్తున్నారు . ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి . మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు .
అయితే అఖండ -2 ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్ . ఈ మూవీ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు . సెప్టెంబర్ 25 న అఖండ -2 రావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పోస్ట్ చేసింది . అయితే ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు . మరింత వీఎఫ్ ఎక్స్ , రీ రికార్డింగ్ మెరుగులు దిద్దేందుకే పోస్ట్ పోన్ చేస్తున్నామని తెలిపారు . ఈ ప్రకటనతో బాలయ్య బాబు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు .
వాయిదాకు కారణాలు
అయితే గతంలోనే అఖండ -2 వాయిదా పడనుందని వార్తలొచ్చాయి . ఎందుకంటే అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ కూడా రిలీజ్ కానుంది . ఆ కారణం వల్లే బాలయ్య సినిమాను వాయిదా వేయనున్నారని టాక్ వినిపించింది . అందరూ ఊహించనట్లుగానే ఇవాల్టి ప్రకటనతో అదే నిజమైంది . అఖండ -2 తప్పుకోవడంతో పవన్ కల్యాణ్ ఓజీకి బాక్సాఫీస్ వద్ద రిలీఫ్ లభించింది . లేకపోతే బాలయ్యతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వచ్చేది . మరోవైపు ఓజీ కోసమే ఈ మూవీని వాయిదా వేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రభావం
కాగా.. అఖండ- 2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తోంది.
చివరి నిమిషంలో అఖండ 2 రిలీజ్ వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందారు. పవన్ కళ్యాణ్ సినిమాతో డేట్ డికేషన్ కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


