
📌 Key Points
- అఖండ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
- రూ.100 కోట్లు దాటి రూ.200 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
- బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసిలో దేవాలయ సందర్శన.
- బాలయ్య సాంప్రదాయ పంచెకట్టులో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకొని బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను వారణాసిలోని దేవాలయాలను దర్శించుకున్నారు. పంచెకట్టులో బాలకృష్ణ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అఖండ 2 విజయోత్సవం వారణాసిలో
నందమూరి బాలయ్య తాజాగా నటించిన అఖండ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి మెయిన్ విలన్ గా మెరిశారు. హిందుత్వం, ఆధ్యాత్మికం, శివుడు చుట్టే తిరిగిన ఈ అఖండ 2 సినిమాను, చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన అఖండ 2 సినిమా, థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లు క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకు వెళ్తోంది. అయితే ఈ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో బాలయ్య బోయపాటి శ్రీను ఇద్దరు కూడా వారణాసిలో మెరిశారు. వారణాసిలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకున్న అఖండ 2 టీమ్ సాంప్రదాయ దుస్తులో మెరిసింది. నందమూరి బాలయ్య అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను ఇద్దరు కూడా పట్టు వస్త్రాల్లో కనిపించి సందడి చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. క్లిక్
బాలయ్య, బోయపాటి పట్టు వస్త్రాల్లో
శివుడి సన్నిధిలో అఖండ 2 టీమ్
అఖండ 2 ఘన విజయాన్ని సాధించిన ఈ తరుణంలో, చిత్ర యూనిట్ వారణాసిలో భగవంతుని ఆశీస్సులు కోరడం విశేషం. ఈ ఆధ్యాత్మిక యాత్ర సినిమా విజయంలో ఒక భాగమని అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య పంచెకట్టులో మరింత ఆకర్షణీయంగా కనిపించారు.


