
నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. జూన్ 9న టీజర్ విడుదల కానుండగా, సెప్టెంబర్ 25న దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాతో పోటీ ఉండటం విశేషం.
Key Points
జూన్ 9న సాయంత్రం 6.03 గంటలకు 'అఖండ 2' టీజర్ విడుదల
దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా విడుదలకు షెడ్యూల్
పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాతో పోటీ
బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో మరో సూపర్ హిట్‌కు అంచనాలు
‘అఖండ 2’ టీజర్ విడుదల తేదీ ప్రకటన
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ తాండవం మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’ నుంచి తాజాగా అప్డేట్ ప్రకటించారు. జూన్ 9న సాయిత్రం 6.03గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు.
2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2ను తెరకెక్కించారు. ఈ ఏడాది దసరా సందర్బంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, అదేరోజున పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన అఖండ2 పోస్టర్‌లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దసరా బరిలో ఈ రెండు పోటీలో ఉంటాయా..? అనే విషయం తెలియాలంటే అఖండ2 టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దసరా రిలీజ్‌తో పోటీ తీవ్రత
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మాజిక్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టీజర్‌తో అసలు విడుదల తేదీ స్పష్టత వస్తుంది. దసరా బరిలో పోటీ ఎలా ఉంటుందో చూడాలి.


