|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: ఎన్టీఆర్ మూవీలో అఖిల్ గెస్ట్ రోల్? అసలే సక్సెస్ లేదు, ఇది అవసరమా?

Published: 25-02-2026, 11:35 PM
షాకింగ్ న్యూస్: ఎన్టీఆర్ మూవీలో అఖిల్ గెస్ట్ రోల్? అసలే సక్సెస్ లేదు, ఇది అవసరమా?
  • అక్కినేని వారసుడిగా అఖిల్ ఎంట్రీ, మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్నాడు!
  • ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అఖిల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా?
  • లెనిన్ సినిమాతో వస్తున్న అఖిల్.. టీజర్ విడుదలైనా బజ్ లేని పరిస్థితి!
  • గెస్ట్ రోల్స్ చేస్తే.. అఖిల్ కెరీర్ పై ప్రభావం పడుతుందని ఫ్యాన్స్ ఆందోళన!

అక్కినేని అభిమానులకు ఒక సంచలన వార్త! అఖిల్ అక్కినేని త్వరలో ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడా? ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

అఖిల్ కెరీర్ లో గెస్ట్ రోల్స్ టర్నింగ్ పాయింట్ అవుతుందా?

Akhil Akkineni : అక్కినేని వారసుడిగా అఖిల్ గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. మొదటి సినిమానే ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఇప్పటివరకు కమర్షియల్ గా భారీ సక్సెస్ ఒక్కటి కూడా కొట్టలేదు అఖిల్. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. హలో, మిసర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు యావరేజ్ గానే నిలిచాయి. ఇవేవి కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు.

అఖిల్ ఎప్పుడు హిట్ కొడతాడా అని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్, ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. త్వరలో లెనిన్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ తో కూడా ఈ సినిమాపై కనీసం బజ్ లేదు. దీంతో ఈ సినిమాపై కూడా సందేహాలు వస్తున్నాయి. అయితే తాజాగా అఖిల్ గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

డ్రాగన్ మూవీలో అఖిల్.. నిజమెంత?

అఖిల్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఓ సీన్ లో అఖిల్ గెస్ట్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

లెనిన్ సినిమాతో హిట్ కొడతాడా?

ఒకవేళ ఇది నిజం అయితే కనక అఖిల్ ఇప్పుడు గెస్ట్ రోల్స్ చేయడం అవసరమా అని అడుగుతున్నారు. మంచి కథ ఎంచుకొని హిట్ కొట్టే ప్లాన్ చేసుకుంటే బెటర్ అని, ఒక సినిమా అఖిల్ గెస్ట్ రోల్ చేసాడంటే తర్వాత చాలా మంది అలాంటి గెస్ట్ రోల్స్ చేయమని అడుగుతారని భావిస్తున్నారు. ఇది అయితే జరగకూడదు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అఖిల్ గెస్ట్ రోల్ గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్స్ అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.