|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhil Akkineni Wife: జైనబ్‌తో అఖిల్ పెళ్లి.. ఇంతకీ ఎవరీమె?

Published: 06-06-2025, 4:17 AM
Akhil Akkineni Wife: జైనబ్‌తో అఖిల్ పెళ్లి.. ఇంతకీ ఎవరీమె?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని జైనబ్ రవ్జీతో వివాహం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ వివాహం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

అఖిల్ అక్కినేని జైనబ్ రవ్జీతో వివాహం చేసుకున్నారు.

2

జైనబ్ ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.

4

అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్లు పెద్దది.

అఖిల్-జైనబ్ వివాహ వేడుక

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున 3 గంటలకు జైనబ్ రవ్జీతో ఒక్కటయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగ్గా.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అఖిల్.. గతేడాది నవంబరులో జైనబ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగేంతవరకు ఎవరికీ తెలియనంత సీక్రెట్‌గా ఉంటారు. ఎంగేజ్‌మెంట్ జరిగిన ఆరు నెలలకు ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

జైనబ్ రవ్జీ: నేపథ్యం

అఖిల్ భార్య జైనబ్ రవ్జీ.. ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్. ఇదివరకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయిలలో ఎగ్జిబిషన్స్ పెట్టింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్ జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమెకు జైన్ రవ్జీ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అతడు జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.

కుటుంబాల మధ్య సంబంధం

జైనబ్ తండ్రి, నాగార్జున స్నేహితులు. అలా వీరిమధ్య ఉన్న స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అలా అఖిల్-జైనబ్ ఒకరికొకరు పరిచయం. అలా కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. గతేడాది పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్ల పెద్ద. అఖిల్ ప్రస్తుత వయసు 31 ఏళ్లు కాగా.. జైనబ్ వయసు 39 అని తెలుస్తోంది. జైనబ్ కూడా గతంలో ‘మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్’ అనే హిందీ సినిమాలో నటించిందని తెలుస్తోంది.

అఖిల్ మరియు జైనబ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వారి సుదీర్ఘమైన సంసార జీవితానికి శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.