|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్ పెళ్లి అంత సింపుల్ గా చేశారా.. నాగార్జునపై ట్రోలింగ్ ?

Published: 08-06-2025, 6:55 AM
అఖిల్ పెళ్లి అంత సింపుల్ గా చేశారా.. నాగార్జునపై ట్రోలింగ్ ?

అక్కినేని అఖిల్ వివాహం జూన్ 6న జరిగింది. సింపుల్‌గా జరిగిన పెళ్లికి నెటిజన్లు, సోషల్ మీడియాలో నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. కేవలం రెండు కోట్ల ఖర్చుతో జరిగిన పెళ్లిపై విమర్శలు వస్తున్నాయి.

Key Points

1

అఖిల్ అక్కినేని పెళ్లి జూన్ 6న జరిగింది.

2

పెళ్లి చాలా సింపుల్‌గా జరిగిందని, నాగార్జునపై ట్రోలింగ్ జరుగుతోంది.

4

రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరుగనుంది.

అఖిల్-జైనాబ్ వివాహం

అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna) రెండవ కుమారుడు అఖిల్ అక్కినేని ( Akhil Akkineni) వివాహం ( Marriage) జూన్ 6వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అఖిల్ అక్కినేని, జైనాబ్ ( Jainab) వివాహం.. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో జూన్ ఆరవ తేదీన తెల్లవారు జామున 3 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం అక్కినేని నాగార్జున దగ్గరి మిత్రులు, కుటుంబ సభ్యులు, కొంతమంది సినీ తారలు మాత్రమే వచ్చారు.

సింపుల్ పెళ్లిపై విమర్శలు

చాలా గ్రాండ్ గా నిర్వహించకుండా సింపుల్ గానే… అఖిల్ అక్కినేని వివాహాన్ని జరిపించారు అక్కినేని నాగార్జున. అయితే ఆదివారం రోజున.. అంటే ఇవాళ సాయంత్రం రిసెప్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఈ రిసెప్షన్ కార్యక్రమం ఉండబోతోంది. అయితే అక్కినేని అఖిల్ వివాహాన్ని సింపుల్ గా చేయడం పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రిసెప్షన్ ఏర్పాట్లు

అఖిల్ అక్కినేని పెళ్లికి కేవలం రెండు కోట్లు మాత్రమే అక్కినేని నాగార్జున ఖర్చు పెట్టాడని సెటైర్లు పేల్చుతున్నారు కొంత మంది. 3000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న అక్కినేని నాగార్జున.. తన కొడుకు పెళ్లిని ఇంత సింపుల్ గా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరి వైరల్ చేస్తున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం నాగార్జున చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది.

అఖిల్ పెళ్లి సింపుల్‌గా జరిగినప్పటికీ, రిసెప్షన్ గ్రాండ్‌గా ఉండనుందని సమాచారం. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై నాగార్జున స్పందించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.