
📌 Key Points
- అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా.
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కారణంగా వాయిదా వేసిన మేకర్స్.
- సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నట్లు ప్రకటన.
- ‘వారెవా వారెవా’ పాటకు మంచి స్పందన లభించింది.
అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో, ‘లెనిన్’ సినిమాను మే 1 నుండి జూన్ 26కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
లెనిన్ మూవీ విడుదల వాయిదాకు కారణం?
Lenin Movie: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘లెనిన్’ (Lenin Movie) మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈసారి వాయిదాకు కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ (Peddi Movie) చిత్రమే కారణమని ఈ ప్రకటనలో తెలిపారు. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా వస్తుండటంతో.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఉన్న బాండింగ్ కారణంగా, ఆ సినిమాకు గౌరవమిస్తూ.. సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మేకర్స్ విడుదల చేసిన ప్రకటనలో..
‘‘మే 1వ తేదీన విడుదల కావాల్సిన ‘లెనిన్’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాము. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న వస్తున్న నేపథ్యంలో, సినిమాలను ఒక సానుకూల, ఆరోగ్యకరమైన వాతావరణంలో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయమని మేము నమ్ముతున్నాము. మా హీరో అఖిల్‌తో రామ్ చరణ్‌కు ఉన్న అనుబంధంతో పాటు, ఆయన ఎప్పుడూ ఒక శ్రేయోభిలాషిగా ఉన్నారనే విషయం తెలియంది కాదు. అందుకే ఆయనకు గౌరవమిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ‘లెనిన్’ చిత్రం 26 జూన్ 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా.. ఎమోషన్‌తో నిండిన ఒక సంపూర్ణ సినిమా పండుగలా ఉంటుందని, మా టీమ్ మొత్తం బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము. వెండితెరపై అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా, ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ అని లెనిన్ టీమ్ ఈ ప్రకటనలో తెలిపింది.
మేకర్స్ ప్రకటనలో ఏం చెప్పారు?
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇటీవల వదిలిన ‘వారెవా వారెవా’ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా, ఈసారి మాత్రం కచ్చితంగా చెప్పిన డేట్‌కి వస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. చూద్దాం మరి.. ఈ సినిమాతో అయినా అఖిల్‌కు అనుకుంటున్న హిట్ వస్తుందేమో..
#LENIN will now arrive on June 26th, 2026. ❤️🔥 #LeninOnJune26th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @musicthaman @KishoreAbburu @NavinNooli @artkolla @leonbrittodp @pramodactor1 @brindhagopal1 @AnnapurnaStdios #ManamEnterprisesLLP @SitharaEnts @tseriessouth pic.twitter.com/EB9Y6c30Ip
కొత్త విడుదల తేదీ ఎప్పుడు?
— Annapurna Studios (@AnnapurnaStdios) March 28, 2026
‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ, జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఒక మంచి అనుభూతినిస్తుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.


