|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్ గుండె నిండా బాధ! ‘లెనిన్’ తో మాస్ రీ-ఎంట్రీ పక్కా! ఫ్యాన్స్ షాక్!

Published: 06-07-2026, 12:02 AM
అఖిల్ గుండె నిండా బాధ! 'లెనిన్' తో మాస్ రీ-ఎంట్రీ పక్కా! ఫ్యాన్స్ షాక్!
  • అఖిల్ ‘లెనిన్’ జులై 10న విడుదల! రెండున్నరేళ్లుగా అభిమానులకు దూరం అంటూ ఎమోషనల్.
  • దర్శకుడు మురళీ కిశోర్ కథ విని వెంటనే ఓకే చేసిన అఖిల్. ఇదో అద్భుతమైన జర్నీ అన్నాడు.
  • నాగవంశీతో కలిసి గొప్ప సినిమా కోసం అడుగులు. ‘లెనిన్’తో ఇంటివాడిని కావాలంటున్న అఖిల్.
  • థమన్ సంగీతం హైలైట్! పూనకాలు తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఇరగదీశాడట.

అఖిల్ అక్కినేని అభిమానులకు షాకింగ్ న్యూస్! ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన మనసులోని బాధను, అభిమానులకు దూరమైన వేదనను పంచుకుంటూ, ఈసారి ‘లెనిన్’ తో పక్కా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సంచలన అప్‌డేట్‌పై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

అఖిల్ భావోద్వేగ ప్రసంగం: అభిమానులకు క్షమాపణ!

అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లెనిన్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున , నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా.. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ఆదివారం తిరుపతిలో ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. రెండున్నరేళ్లుగా అభిమానులకు తన మొహం చూపించలేకపోతున్నానని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ.. ”గ్యాప్ వచ్చింది.. అందుకు మొన్న వైజాగ్ ఈవెంట్ లో సారీ చెప్పాను. మళ్లీ ఇవాళ కూడా సారీ చెప్తున్నా. నా మనసులో ఎంతో బాధగా ఉంది. రెండున్నరేళ్లుగా మీతో సంప్రదించలేకపోతున్నా. నా మొహం చూపించలేకపోతున్నా. అది నేను ఫ్రాంక్ గా ఒప్పుకోవాలి. ఈరోజు ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను. దానికి కారణం ‘లెనిన్’ సినిమా. ‘నేను కొత్తగా కనిపించాలి.. బాగా చేయాలి’ అని చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఈసారి నేను మీ ఇంటివాడిని అయిపోవాలి అనేదే ‘లెనిన్’ వెనుక నా ఉద్దేశ్యం. మీరు నన్ను ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్తారో అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఆ ప్రయత్నమే ఈ ‘లెనిన్” అని అన్నారు. ”రెండేళ్ల క్రితం ఈ సీమ బిడ్డ నందు మురళీ కిశోర్ ను కలిశాను. నాకు ఒక అద్భుతమైన కథ చెప్పాడు. విన్న వెంటనే ఒక హగ్ ఇచ్చి ‘ప్లీజ్, ఇంకెవరితో ఈ స్టోరీ చేయకు. ఇది నా కథ. ఎక్కడో నాకోసమే రాశావు’ అని అన్నాను. నా మైండ్ లో రన్ అవుతున్న బాధ, నా జర్నీ అంతా ఆ కథలో కనిపించాయి.. వినిపించాయి. వెంటనే చేయాలని అనిపించింది. నాగవంశీ ఈ సినిమా నాతో చేయాలని అనుకున్నాడు. మా ఇద్దరి మధ్య పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. కలిసి ఒక గొప్ప సినిమా చేద్దాం బ్రదర్ అని వంశీని నాన్నగారి దగ్గరకు తీసుకెళ్లాను. హిట్టు, బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా.. ప్రేక్షకులను ఒక మంచి సినిమా, కొత్త ఎక్స్ పీరియన్స్ ఇద్దామని బయలుదేరాం. ఇందులో ఎంతోమంది చేతులు కలిసాయి. వాళ్లందరి వల్లనే నేను ఈరోజు స్టేజ్ మీద కాన్ఫిడెంట్ గా మాత్రమే కాదు, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ తో నిల్చున్నాను” ”థమన్ మామ, నేనూ రెండు మూడు రోజుల క్రితమే బ్యాగ్రౌండ్ స్కోర్ చూసుకున్నాం. ఇరగ్గొట్టేశాడు. ఇది హెలికాఫ్టర్ షాట్ అని మొన్న ట్వీట్ పెట్టాడు. థమన్ ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. కొన్నిచోట్ల పూనకాలు తెప్పించే విధంగా మ్యూజిక్ ఇచ్చాడు. అవి చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నన్ను అర్థం చేసుకున్నందుకు దర్శకుడు నందుకు థ్యాంక్స్. నాకు కరెక్ట్ గా దొరికాడు. నేను ఈ పాత్ర చేయగలనని నమ్మాడు. నన్ను ఇలా ప్రజెంట్ చేయగలడని తనను తాను నమ్మాడు. భారతి పాత్ర కోసం భాగ్యశ్రీ చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె ఎంత కష్టపడిందనేది నేను కళ్లారా చూశాను. మేము సెట్ కి వెళ్లే టైంకే ఇరగదీస్తూ ఉండేది. అది చూసి మాకొక ఎనర్జీ వచ్చేది. టీమంతా ఒక కుటుంబంలాగా చాలా కష్టపడ్డాం. జూలై 10న సినిమా మాట్లాడుతుంది. సినిమానే మాట్లాడుతుంది” అని అఖిల్ చెప్పుకొచ్చారు. * కమ్ టు మై రూమ్.. ‘లెనిన్’ ఈవెంట్‌లో బ్రహ్మాజీ మాటలకు యాంకర్ సుమ షాక్

‘లెనిన్’ వెనుక అఖిల్ కథ: డైరెక్టర్ తో బంధం!

థమన్ మామ మ్యూజిక్: పూనకాలు తెప్పిస్తుందట!

‘లెనిన్’ తో అఖిల్ అక్కినేని మాస్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అతని భావోద్వేగ ప్రసంగం, సినిమాపై అతని నమ్మకం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. జులై 10న ‘లెనిన్’ విడుదల కానున్న నేపథ్యంలో, మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.