
📌 Key Points
- శోభిత ధూళిపాళ రోజ్ పింక్ చీరలో అందంగా ముస్తాబయ్యారు.
- సిల్వర్ జ్యువెలరీతో తెలుగింటి కోడలిగా శోభిత దర్శనం.
- ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- శోభిత అందంపై నెటిజన్లు ఆశ్చర్యం, ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా చీరకట్టులో మెరిసిపోయారు. అక్కినేని నాగచైతన్య సతీమణిగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శోభిత.. రోజ్ పింక్ చీరలో తెలుగింటి కోడలిగా దర్శనమిచ్చారు. ఆమె లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
శోభిత ధూళిపాళ సినీ కెరీర్
స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు అమ్మాయి అయిన ఈ భామ బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో మేజర్, గూఢాచారి సినిమాల్లో నటించింది మంచి ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తమిళంలోనూ మెప్పించింది.
చీరకట్టులో అక్కినేని కోడలు
అయితే గత ఏడాది అక్కినేని హీరో నాగచైతన్యను శోభిత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మ్యారేజ్ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ తన అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తన భర్తతో తీసుకున్న ఫొటోస్‌తో పాటు తన పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా శోభిత పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నెటిజన్ల ప్రశంసలు, వైరల్ పిక్స్
తాజాగా అక్కినేని కోడలు తన ఇన్‌స్టా అకౌంట్‌లో రోజ్ పింక్ కలర్‌లోఉన్న శారీలో అందంగా ముస్తాబయ్యింది. ఇక ఈ చీరకు సిల్వర్ కలర్ జ్యువెలరీ పెయిరప్ చేసింది. అలా కట్టు బొట్టుతో తెలుగింటి కోడలిగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఇన్నాళ్లు ఎక్కడ దాచావు ఇంత అందాన్ని అని, అసలు శోభిత ఏంటి అంత బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్‌పై మీరు ఓ లుక్ వేసేయండి.
మొత్తంగా, శోభిత ధూళిపాళ తన కొత్త చీరకట్టుతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆమె అందం, తెలుగు సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.


