
తెలుగు సినీ నటి శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. జూన్ నెల ఫోటోలతో పాటు కోట్స్‌ను షేర్ చేయడంతో నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.
Key Points
శోభిత ధూళిపాళ తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది.
జూన్ నెల ఫోటోలతో పాటు కోట్స్‌ను షేర్ చేసింది.
నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.
నాగ చైతన్యతో వివాహం తర్వాత శోభిత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది.
శోభిత ధూళిపాళ తాజా పోస్ట్
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్(Bollywood0లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya).. సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది.
వైరల్ అవుతున్న ఫోటోలు
అంతేకాకుండా చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని వేకెషన్స్, హోటల్స్‌కి కూడా వెళ్ళింది. అయితే ఆ ఫొటోస్ కాస్తా నెట్టింట బయటపడటంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ వీరిద్దరూ ఆ విషయం పై స్పందించలేదు. కానీ డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్‌గా మ్యారేజ్(Marriage) చేసుకుని భార్యా భర్తలు అయ్యారు. ఇక అప్పటినుంచి అక్కినేని కోడలు స్టేటస్‌తో పాటు భర్తతో ఎంజాయ్ చేస్తుంది శోభిత.
నెటిజన్ల ప్రశంసలు
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో జూన్ నెలలో ఫొటోస్ అని కొన్ని తన పిక్స్‌తో పాటు కొన్ని కోట్స్‌ను షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఎవరు ఏమనుకున్నా నువ్వు మాత్రం చాలా చాలా బాగుంటావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో చురుకుగా ఉండి అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఆమె అందం, స్టైల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


