|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఇప్పుడు ఏం కొనొచ్చు?

Published: 04-09-2025, 2:45 AM
అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఇప్పుడు ఏం కొనొచ్చు?

తెలుగు సినీ రంగంలో అద్భుతమైన నటుడిగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం, ఆయన తొలి రెమ్యూనరేషన్ గురించి ఈ కథనం వివరిస్తుంది. ఆయన నాటకాల ద్వారా సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసుకుందాం.

Key Points

1

అక్కినేని నాగేశ్వరరావు తొలి నాటకానికి 25 పైసలు మాత్రమే పారితోషికం పొందారు.

2

తరువాత నాటకాలకు 5 రూపాయలు చొప్పున పారితోషికం పొందారు.

4

నెలకు 250 రూపాయల జీతంతో సినీ ప్రయాణం ప్రారంభించారు.

నాటకాలతో ప్రారంభమైన ప్రయాణం

తెలుగు సినీ ప్రపంచాన్ని అద్భుత నటనతో మెప్పించిన అక్కినేని నాగేశ్వరరావు జన్మించి వందేళ్లు పూర్తయ్యింది. ఈమధ్య కాలంలోనే ఆయన శతజయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అరుదైన, ఇప్పటివరకు తెలియని విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన సినీ ప్రయాణం మొదలైనప్పుడు పొందిన తొలి పారితోషికం కూడా చర్చనీయాంశంగా మారింది.

అక్కినేని నాగేశ్వరరావు నటన ప్రయాణం చిన్నతనంలోనే నాటకాలతో మొదలైంది. విద్యాభ్యాసానికి సరిపడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్కూల్‌ను నాలుగోవ తరగతిలోనే మానేసి నాటకాలకే పూర్తిగా మొగ్గుచూపారు. ఆ సమయంలో ఊరూరా తిరుగుతూ నాటకాలు వేస్తూ జీవనం సాగించారు. తొలి నాటకానికి ఆయనకు కేవలం 25 పైసలు( పావల) మాత్రమే అందుకున్నారు. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఏఎన్నార్ స్వయంగా వెల్లడించారు. ఆతరువాత కాలంలో నాగేశ్వరావు ఒక్కో నాటకానికి 5 చొప్పున అందుకున్నారట.ఇక నాగేశ్వారావు అందుకున్న తొలి పారితోషికం పావల ఇప్పుడు చెల్లని పైసాగా మారింది.

సినిమా అవకాశం మరియు మొదటి జీతం

అయితే ఈ నాటకాల ద్వారానే అక్కినేని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. బెజవాడ రైల్వే స్టేషన్ వద్ద నాటక ప్రదర్శన సందర్భంగా ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారి దృష్టిలో అక్కినేని పడ్డారు. ఆయనకు అక్కినేని నటన నచ్చి సినిమా అవకాశం ఇస్తాను నాతో వస్తావా అని అడిగారట. ఏఎన్నారు సరే అనడంతో మద్రాస్‌ వెళ్లి సినిమాల్లో మొదటి అవకాశం పొందారు. మద్రాస్‌లో బలరామయ్యగారు ఆయనకు వసతి, భోజనం ఏర్పాటు చేయడంతో పాటు నెలకు 250 జీతంగా కూడా ఇచ్చారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితంలో తీసుకున్న మొదటి జీతం.

ఈ జీతంలోనూ నెలకు 50 రూపాయలు టిఫిన్, భోజనం కోసం ఖర్చు చేయడంతో, పాండిబజార్‌లో ఉన్న ఓ హోటల్‌కి తరచూ వెళ్లేవారట. అక్కడ ఇడ్లీ తీసుకుని రెండుసార్లు సాంబార్‌ తాగడాన్ని గమనించిన హోటల్‌ యజమాని “సాంబార్‌ బ్యాచ్‌” అంటూ కాస్త వ్యంగ్యంగా పిలిచేవాడట. కానీ ఆ మాటలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారట అక్కినేని.

ఏడు దశాబ్దాల సినీ జీవితం

సినీ పరిశ్రమలో మొదటగా ‘ధర్మపత్ని’ అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరపై కనిపించిన ఏఎన్నార్‌, ఆ తర్వాత ‘సీతారామ జననం’ సినిమాతో హీరోగా మారారు. అప్పటి నుండి తన జీవిత కాలంలో దాదాపు ఏడు దశాబ్దాల పాటు 259 సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఏఎన్నార్‌ చిత్రంతో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయగా, మూడు రోజుల పాటు ఏఎన్నార్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ కూడా నిర్వహించారు. ఇందులో దేవదాసు, ప్రేమాభిషేకం వంటి క్లాసిక్ సినిమాలు ప్రదర్శించారు.

అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ ప్రయాణం ఒక చిన్న పారితోషికంతో మొదలై, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆయన శతజయంతి వేడుకలు ఆయనకు నివాళి.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.