|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకరోజు ముందే ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మలయాళం స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా.. తెలుగులో అదిరిపోయే డైలాగ్స్.. నవ్వులే నవ్వులు

Published: 12-06-2025, 8:50 AM
ఒకరోజు ముందే ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మలయాళం స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా.. తెలుగులో అదిరిపోయే డైలాగ్స్.. నవ్వులే నవ్వులు

మలయాళ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ సినిమా ‘ఆలప్పుళ జింఖానా’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగు ప్రేక్షకుల కోసం అదిరిపోయే డబ్బింగ్ తో ఈ సినిమా విడుదలైంది.

Key Points

1

బ్లాక్ బస్టర్ మలయాళం కామెడీ 'ఆలప్పుళ జింఖానా' ఓటీటీలో!

2

తెలుగు డబ్బింగ్ అదిరిపోయింది, నవ్వుల పంట!

4

స్పోర్ట్స్, కామెడీ, మరియు సూపర్బ్ నటనతో నిండి ఉంది!

ఆలప్పుళ జింఖానా ఓటీటీ విడుదల

మలయాళం థ్రిల్లర్ మూవీసే కాదు.. కామెడీ సినిమాలు కూడా అదిరిపోతాయని నిరూపించిన మూవీ ఆలప్పుళ జింఖానా (Alappuzha Gymkhana). బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ మూవీ.. చెప్పినదాని కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అదిరిపోయే డైలాగ్స్ ఉన్న ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి ఈ ఆలప్పుళ జింఖానా. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నిజానికి శుక్రవారం (జూన్ 13) నుంచి స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పిన సోనీ లివ్ (Sony Liv) ఓటీటీ గురువారం సాయంత్రమే ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

“మీ హృదయాలను గెలవడానికి జింఖానా గ్యాంగ్ వచ్చేసింది. ఆలప్పుళ జింఖానా మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ కాసేపటి కిందట ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర రూ.65 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

అద్భుతమైన తెలుగు డబ్బింగ్

ఆలప్పుళ జింఖానా మూవీ ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ఇదో స్పోర్ట్స్ కామెడీ మూవీ. ఖాలిద్ రెహమాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఐదుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిలై.. ఉన్నత చదువుల కోసం స్పోర్ట్స్ కోటాలో సీట్లు సాధించాలనుకుని బాక్సింగ్ ను ఎంచుకుంటారు వీళ్లు. అదే వాళ్ల జీవితాలను మలుపు తిప్పుతుంది.

స్థానికంగా ఉన్న ఆలప్పుళ జింఖానాలో బాక్సింగ్ కోచింగ్ కోసం చేరతారు. మొదట జిల్లా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచి కాలేజీలో సీట్లు సంపాదించాలని ఆరాటపడతారు. మరి వాళ్ల కల నెరవేరిందా లేదా అన్నది ఈ మూవీలో చూడాలి.

కథానీయాసం మరియు నటీనటులు

ప్రేమలు ఫేమ్ నస్లేన్ గఫూర్ తోపాటు సందీప్ ప్రదీప్, లూక్మన్ అవరన్, గణపతి, అనఘ రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరణ్ లాంటి వాళ్లు నటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అయినా.. బాక్సింగ్ కంటే కామెడీతోనే ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. డైలాగులు అదిరిపోయాయి. ఇక్కడి ప్రేక్షకులను బాగా ఆకర్షించేలా తెలుగులో డైలాగులు రాశారు. అదే స్థాయిలో డబ్బింగ్ కూడా చెప్పారు.

నస్లేన్ తోపాటు మిగిలిన నటీనటులందరూ చాలా సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. విష్ణు విజయ్ అందించిన మ్యూజిక్, బీజీఎం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. రెండు గంటల 20 నిమిషాల పాటు హాయిగా నవ్వించే మూవీ ఈ ఆలప్పుళ జింఖానా. సోనీ లివ్ ఓటీటీలో వెంటనే చూసేయండి.

మొత్తంగా, ఆలప్పుళ జింఖానా ఒక చూడవలసిన సినిమా. తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.