|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలపై అలీ రియాక్షన్‌ ఇదే

Published: 02-06-2025, 6:55 AM
రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలపై అలీ రియాక్షన్‌ ఇదే

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రముఖ నటుడు అలీ ఈ వ్యాఖ్యలపై తన స్పందనను వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Key Points

1

రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అలీ స్పందించారు.

2

అలీ, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం కాదని అన్నారు.

4

నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో చాలామంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ వేదికపై నటుడు రాజేంద్ర ప్రసాద్‌( Rajendra Prasad) చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయి. ప్రముఖ కమెడియన్‌ అలీ పై రాజేంద్ర ప్రసాద్‌ చేసిన అత్యంత నీచమైన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.  ఈ క్రమంలో తాజాగా నటుడు అలీ కూడా ఒక వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అలీ యొక్క స్పందన

రాజేంద్ర ప్రసాద్‌ గురించి నటుడు అలీ ఇన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  రాజేంద్ర ప్రసాద్‌ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఉద్దేశపూర్వకంగా అనలేదు. పోరాపాటున మాట తూలింది. కానీ, మీడియా మిత్రులు దానిని వైరల్‌ చేస్తున్నారు. ఆయనొక మంచి నటుడు, కొద్దిరోజుల క్రితం తనకు అమ్మలాంటి కూతురు మరణం వల్ల పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆయన పెద్దాయన, కావాలని అనలేదు.’ అని నటుడు అలీ అన్నారు.

వివాదం కొనసాగుతోంది

రాజేంద్ర ప్రసాద్‌ తన వ్యాఖ్యల పట్ల తప్పు తెలుసుకుని అలీకి క్షమాపణలు చెబుతారని అందరూ భావించారు. కానీ, ఆయన అలాంటి పనిచేయకుండా తను అన్న మాటలను సమర్ధించుకుంటూ.. మరోసారి తన నోటికి పని చెప్పారు. తాను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని రాజేంద్ర ప్రసాద్ ఇలా వివరణ ఇచ్చారు. ‘నా మాటలను అర్థం చేసుకోవడం అనేది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ. దానికి ఎవరూ ఏం చేయలేం. నేనైతే ఇలాగే సరదాగా ఉంటాను.’ అని అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు వివాదాస్పదమై, అలీ స్పందనతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం ఇంతటితో ముగిసిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.