|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajendra Prasad: బూతులు మాట్లాడటంపై రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. మీకు సంస్కారం లేదు అది మీ కర్మ అంటూ ఫైర్

Published: 02-06-2025, 6:00 AM
Rajendra Prasad: బూతులు మాట్లాడటంపై రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. మీకు సంస్కారం లేదు అది మీ కర్మ అంటూ ఫైర్

టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన తాజా వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. ‘షష్టిపూర్తి’ సినిమా సక్సెస్ మీట్ లో ఆయన తన వ్యాఖ్యలను వివరించారు. ఆయన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.

Key Points

1

రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు.

2

ఆయన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

4

ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’ సినిమా సమయంలో డేవిడ్ వార్నర్‌ను ఏదో మాట అని క్షమాపణలు చెప్పారు. ఇక ఇటీవల కమెడియన్ అలీని(ali) రాజేంద్ర ప్రసాద్ బూతులు తిట్టారు. అయితే ఈ కామెంట్స్ వివాదానికి దారితీశాయి. అంత పెద్ద స్టార్ అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడమేంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా, ఈ కాంట్రవర్సీపై రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’ (Shashtipurthi)సినిమా సక్సెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇళయరాజా(Ilaiyaraaja) పుట్టినరోజు నాడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించడం నాకెంతో ఆనందంగా ఉంది.

ఆయనకు నేనంటే ఎంతో అభిమానం, ప్రేమ. అయితే ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో నేను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మం. నేనైతే ఇలానే ఎప్పుడూ సరదాగానే ఉంటాను. మీడియాను నా కుటుంబంగా భావిస్తాను. నన్ను మీరంతా అన్నయ్య అని పిలవడం నా అదృష్టం. ఓ యాక్టర్ గురించి సరదాగా మాట్లాడినా తప్పుగా అనుకున్నారు. నేను ఇలానే ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వివాదం మరియు స్పందనలు

సోషల్ మీడియాలో చర్చ

రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, వాటిని తప్పుగా అర్థం చేసుకున్న వారి సంస్కారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.