
బాలీవుడ్ నటుడు గోవిందా భార్య సునీతా అహుజా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం బీ-టౌన్‌ను షేక్ చేస్తున్నాయి. ‘లాక్ అప్’ రియాలిటీ షోలో ఆమె తన భర్తకు 50 అఫైర్స్ ఉన్నా వదులుకోనని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు షో రేటింగ్‌లను అమాంతం పెంచేశాయి.
Key Points
గోవిందా భార్య సునీతా అహుజా 'లాక్ అప్' షోలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన భర్తకు 50 అఫైర్స్ ఉన్నా వదులుకోనని సునీతా తెగేసి చెప్పింది.
గోవిందా, రాణీ ముఖర్జీ అఫైర్ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఈ కామెంట్స్‌తో 'లాక్ అప్' షో రేటింగ్‌లు ఒక్కసారిగా పెరిగాయి.
సునీతా అహుజా సంచలన వ్యాఖ్యలు
Sunita Comments: బీ టౌన్ లో ఎప్పుడు ఏ న్యూస్ ఎలా వైరల్ అవుతుందో తెలీదు. ఇక తాజాగా ‘లాక్ అప్’ రియాలిటీ షోలో గోవిందా భార్య సునీతా అహుజా చేసిన కామెంట్స్ కూడా ఇపుడు అలానే వైరల్ అవుతుంది. ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా చేస్తున్న ఈ పాపులర్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె తన కామెంట్స్ కి కట్టుబడే ఉన్నానని తెగేసి చెప్పడం ఇక్కడ విశేషం.
తన భర్తకు ఎన్ని అఫైర్స్ ఉన్నా తాను అస్సలు వదులుకోనని, ముఫ్ఫై ఏళ్లకు పైగా సాగిన తమ సంసార జీవితం చాలా గట్టిదని కుండబద్దలు కొట్టేసింది. ఒక భార్య స్థానాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరని, ఆ నమ్మకమే తనను నడిపిస్తోందని ఓపెన్ గానే చెప్పేస్తుంది.
50 అఫైర్స్ ఉన్నా అది తమ పర్సనల్ మ్యాటర్
గోవిందా కెరీర్, వ్యక్తిగత జీవితం
సునీతా మాట్లాడుతూ తన భర్తకి 50 అఫైర్స్ ఉన్నా అది తమ పర్సనల్ మ్యాటర్ అని , అయితే గోవిందాకి అలా అఫైర్స్ ఉన్నా తనకెలాంటి పశ్చాత్తాపం లేదని కుండబద్దలు కొట్టేసింది .ఇక సునీతా అహుజా ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా ‘లాక్ అప్’ షో రేటింగ్ లు ఒక్కసారిగా దూసుకుపోవడం విశేషం.ఈ షో విషయానికి వస్తే 2022లో కంగనా రనౌత్ హోస్ట్‌గా, కరణ్ కుంద్రా జైలర్‌గా మొదలైన ఈ షోలో మొదటి సీజన్ లో మునావర్ ఫారూఖీ టైటిల్ విన్నర్ అయిన సంగతి తెల్సిందే.ఇక సరికొత్తగా వస్తున్న ఈ రెండో సీజన్ లో 14 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా సునీతా గోవిందాపై చేసిన కామెంట్స్ షో పై ఎక్కడ లేని అంచనాలు పెంచేశాయ్.
1986లో వచ్చిన ‘ఇల్జామ్’ తో హిందీ తెరపైకి ఎంట్రీ
గోవిందా విషయానికి వస్తే 1980, 90ల కాలంలో బాలీవుడ్‌ను తనదైన కామెడీ టైమింగ్ తో ఏలాడనే చెప్పాలి.1986లో వచ్చిన ‘ఇల్జామ్’ తో హిందీ తెరపైకి ఎంట్రీ ఇచ్చిన గోవిందా ఆ తర్వాత ‘కూలీ నెం. 1’, ‘రాజా బాబు’, ‘హీరో నెం. 1’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ లీగ్ లోకి దూసుకుపోయాడు.ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 1987లో సునీతని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు గోవిందా. అయితే కెరీర్ దెబ్బ తింటుందన్న భయంతో దాదాపు రెండేళ్ల పాటు ఈ పెళ్లి విషయాన్ని సీక్రెట్ గానే ఉంచారు.ఇక వీరి సంసారానికి గుర్తుగా టీనా అహుజా, యశ్‌వర్ధన్ అహుజా అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.
‘లాక్ అప్’ షోకు పెరిగిన క్రేజ్
వీటికి గోవిందా ఎలాంటి రిప్లయ్ ఇస్తాడో !
అయితే అప్పట్లో స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీతో గోవిందా అఫైర్ నడిపారంటూ అప్పట్లో బీ టౌన్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టడం కూడా అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు . ఏది ఏమైనా సునీతా ఇలా మరోసారి గోవిందా అఫైర్స్ సంగతిని మరోసారి బయటపెట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది బాలీవుడ్. చూడాలి వీటికి గోవిందా ఎలాంటి రిప్లయ్ ఇస్తాడో !
సునీతా అహుజా ధైర్యంగా చేసిన ఈ కామెంట్స్ ఆమె వ్యక్తిత్వాన్ని, దాంపత్య బంధంపై ఆమెకున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు గోవిందా అభిమానులతో పాటు బాలీవుడ్ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించాయి. గోవిందా దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.


