
బాలీవుడ్ నటి ఆలియా భట్‌కు సంబంధించిన ఒక షాకింగ్ వార్త బయటపడింది. ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 77 లక్షల మోసం ఆమె చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
Key Points
ఆలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ వేదిక ప్రకాశ్ శెట్టి అరెస్ట్
రూ.77 లక్షల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు
ఆలియా సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ బిల్లులు సృష్టించింది
ఐదు నెలల క్రితం ఆలియా తల్లి సోనీ రజ్దాన్ ఫిర్యాదు చేశారు
మాజీ పీఏ అరెస్ట్
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt ) మాజీ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) వేదికా ప్రకాశ్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ సోనీ రజ్దాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాశ్‌శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ. 77 లక్షల మోసం
2021 నుంచి 2024 వరకు అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్‌లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదికా నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్నీ మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆలియా తల్లి ఫిర్యాదు
ఐదు నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్తాన్, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వేదిక ప్రకాశ్ శెట్టి అనే మాజీ పర్సనల్ అసిస్టెంట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఆలియా భట్ పేరుతో రూ. 77 లక్షల మోసం చేసిందని తేలింది. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతుంది.


