|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గేట్ బయటకెళ్లండి.. మీ బిల్డింగ్ కాదు ఇది.. ఫొటోగ్రాఫర్లపై కసురుకున్న హీరోయిన్ అలియా భట్ (వీడియో)

Published: 15-08-2025, 1:13 AM
గేట్ బయటకెళ్లండి.. మీ బిల్డింగ్ కాదు ఇది.. ఫొటోగ్రాఫర్లపై కసురుకున్న హీరోయిన్ అలియా భట్ (వీడియో)

RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అలియా భట్, తాజాగా ఫొటోగ్రాఫర్లపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చిన ఫొటోగ్రాఫర్లను బయటకు పంపమని కోరిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

అలియా భట్ ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

2

ప్రైవేట్ ప్రాపర్టీలోకి ప్రవేశించిన ఫొటోగ్రాఫర్లను బయటకు వెళ్ళమని కోరింది.

4

నెటిజన్లు, అభిమానులు ఈ ఘటనపై విభిన్నంగా స్పందిస్తున్నారు.

అలియా భట్ యొక్క ఆగ్రహం

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అలియా భట్. అప్పుడప్పుడు హీరోయిన్స్ సహనం కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటి అలియా భట్ కూడా సహనం కోల్పోయి ఫొటోగ్రాఫర్లపై కోపంతో కసురుకుంది.

అలియా భట్ ఇటీవల తనను ఫోటో తీయడానికి ఓ ప్రైవేట్ ప్రాపర్టీలోకి ప్రవేశించిన పాపరాజీల (ఫొటోగ్రాఫర్లు)పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాకు చిక్కింది. పికిల్ బాల్ గేమ్ ఆడేందుకు అలియా భట్ వచ్చింది. ఈ క్రమంలోనే తన వెంట వచ్చిన ఫొటోగ్రాఫర్లు భవనం ఆవరణలోకి అడుగు పెట్టారు.

ఫోటోగ్రాఫర్ల పట్ల సహనం కోల్పోయిన అలియా తన కారు నుంచి దిగి పాపరాజీలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. “ప్లీజ్ లోపలికి రావద్దు. ఇది మీ భవనం కాదు. దయచేసి గేట్ బయటకు వెళ్లండి” అని అసహనంతో అలియా భట్ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఫొటోగ్రాఫర్ల ప్రవర్తన

సహనం కోల్పోయిన అలియా భట్ ఫొటోగ్రాఫర్లను రిక్వెస్టింగ్‌గానే బయటకు వెళ్లమని కోరింది. అలియా భట్ పదేపదే కోరినప్పటికీ ఫోటోగ్రాఫర్లు అక్కడే ఉండిపోయారు. లోపలికి వెళ్లే ముందు మాత్రం అలియా భట్ తన స్థలాన్ని గౌరవించాలని పట్టుబట్టింది. ఆ వీడియోనే ఆన్‌లైన్‌లో గింగిరాలు తిరుగుతోంది.

ఈ వీడియోపై నెటిజన్స్, అలియా భట్ ఫ్యాన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడే హక్కు అలియాకు ఉందని అభిమానుల నుంచి మద్దతు లభించింది. ‘హద్దులు, మీడియా హద్దులను గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని ఒకరు రాసుకొచ్చారు.

నెటిజన్ల స్పందన

‘వాళ్లకు అంత స్వేచ్ఛ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఫొటోగ్రాఫర్స్‌ను ఎవరైనా గాయపరిచి వారిని తీవ్ర ఇబ్బందుల్లో పడే రోజు వస్తుంది. అప్పుడు వారు నేర్చుకుంటారు’ అని మరొకరు పేర్కొన్నారు. మరో అభిమాని అలియాకు సపోర్ట్ చేస్తూ ‘ఆమె చెప్పింది కరెక్టేగా. వాళ్లకు కాస్తా కామన్ సెన్స్‌ ఉండాలిగా. అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది’ అని కామెంట్ చేశారు.

ఇకపోతే రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ అలియా భట్. ఈ మూవీతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఆ సినిమా తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు అలియా భట్.

అలియా భట్ ప్రైవేట్ స్థలాన్ని గౌరవించాలని కోరిన విధానం చర్చనీయాంశం అయింది. ఈ ఘటన మీడియా మరియు ప్రజల మధ్య హద్దుల గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.