|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allari Naresh: మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైన అల్లరి నరేష్.. టైటిల్‌తోనే సినిమాపై మంచి బజ్

Published: 25-06-2025, 11:46 AM
Allari Naresh: మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైన అల్లరి నరేష్.. టైటిల్‌తోనే సినిమాపై మంచి బజ్

అల్లరి నరేష్ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమాకు ‘రంభ ఊర్వశీ మేనక’ అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘రాధా’ ఫేమ్ చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Key Points

1

అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.

2

‘రంభ ఊర్వశీ మేనక’ అనే ఆకర్షణీయమైన టైటిల్‌తో సినిమా ప్రకటించబడింది.

4

రెండు పెద్ద బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

అల్లరి నరేష్ కొత్త సినిమా

అల్లరి నరేష్ (Allari Naresh) ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. కమెడీయన్‌గానే కాకుండా.. ఈ మధ్య కాలంలో ‘నాంది’, ‘ఉగ్రం’ లాంటి సినిమాలు తీసి కమర్షియల్‌గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాకు ‘రాధా’ ఫేమ్ డైరెక్టర్ చంద్ర మోహన్ (Chandra Mohan) దర్శకత్వం వహిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు టాప్ మోస్ట్ బ్యానర్లపై నిర్మించేందుకు చర్చలు నడుస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి ‘రంభ ఊర్వశీ మేనక’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. అయితే.. టైటిల్ విని ముగ్గురు హీరోయిన్లు, సోషియో ఫాంట‌సీ క‌థ‌ అనుకుంటే పొరబడినట్లే. ఈసారి డైరెక్టర్ చంద్ర మోహన్ సరికొత్తగా ఆలోచించి.. టైటిల్ వెన‌కే గ‌మ్మతైన క‌థ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కథ ఏమిటో తెలియాలంటే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది అంటున్నాయి. ఫీలిమ్ వర్గాలు. ఏదేమైన టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. కాగా.. ‘బ‌చ్చల మ‌ల్లి’ త‌ర్వాత న‌రేష్ ‘12ఏ రైల్వే కాల‌నీ’ అనే సినిమా చేశాడు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. ఈ మూవీ అనంతరం ‘రంభ ఊర్విశీ మేనక’ చేయ‌బోతున్నట్లు టాక్.

రంభ ఊర్వశీ మేనక టైటిల్‌తో ఆసక్తి

చంద్ర మోహన్ దర్శకత్వం

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశీ మేనక’ సినిమా టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా కథ మరియు విడుదల తేదీల కోసం మనం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.