|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Aravind : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ..

Published: 14-08-2025, 10:21 AM
Allu Aravind : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ..

సైమా అవార్డుల కార్యక్రమంలో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాకు లభించిన జాతీయ అవార్డులను గురించి మాట్లాడుతూ, ఆయన ఇండస్ట్రీలోని వ్యవహారాలను ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Key Points

1

అల్లు అరవింద్ సైమా అవార్డుల కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు వచ్చినా, సరైన గుర్తింపు లేదని ఆయన అన్నారు.

4

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సైమా అవార్డుల కార్యక్రమం

Allu Aravind : నేడు సైమా అవార్డులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కార్యక్రమం ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే సైమా ఈవెంట్ అనౌన్స్ తో పాటు ఇటీవల నేషనల్ అవార్డులు గెలుచుకున్న తెలుగు వారిని పిలిచి అభినందించారు. వారితో మాట్లాడించారు.

అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో ఈవెంట్ కి హాజరయిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలుగులో మనకు ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించి వాళ్ళందర్నీ ఒక స్టేజి మీదకు తీసుకొచ్చి సత్కరించడం హర్షించదగ్గ విషయం. మనకు ఏడు అవార్డులు వచ్చాయి. అందులో తెలుగు విభాగంలోనే కాక నేషనల్ వైడ్ అవార్డులు కూడా వచ్చాయి. దీన్ని ఒక పంగలా జరుపుకోవాలి కానీ ఇక్కడ సంగతి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

వైరల్ అవుతున్న వ్యాఖ్యలు

Also See : Sravanthi Chokarapu : ఇండిపెండెన్స్ డే.. ముందుగానే స్పెషల్ ఫొటోషూట్ చేసిన యాంకర్ స్రవంతి..

అల్లు అరవింద్ వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమలోని అంతర్గత విషయాలపై చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యల ప్రభావం మరియు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.