|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి కోసం అల్లు అరవింద్ సంచలన అబద్ధం! షాకింగ్ సీక్రెట్స్ రివీల్!

Published: 04-03-2026, 5:05 AM
చిరంజీవి కోసం అల్లు అరవింద్ సంచలన అబద్ధం! షాకింగ్ సీక్రెట్స్ రివీల్!
  • చిరంజీవిని డైరెక్ట్ చేయాలనీ విశ్వనాథ్ కు అబద్ధం చెప్పిన అల్లు అరవింద్!
  • విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి కాంబినేషన్ కోసం అల్లు అరవింద్ ప్లాన్.
  • గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అల్లు అరవింద్.
  • చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒక సంచలనం! అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి కోసం ఒక పెద్ద అబద్ధం చెప్పారట. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం!

చిరంజీవి – విశ్వనాథ్ కాంబో సీక్రెట్ ఇదేనా?

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి–అల్లు కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్‌కు చిరంజీవి అంటే అపారమైన గౌరవం, అభిమానం. ఇప్పటికీ వీరి గురించి ఎన్ని వార్తలు వచ్చినా.. అదే అనుబంధం కొనసాగిస్తున్నారు. చిరంజీవితో ఎన్నో సినిమాలు నిర్మించాడు అల్లు అరవింద్. ఈక్రమంలో ఓ సినిమా కోసం అరవింద్ చిరంజీవితో ఓ అబద్దం కూడా చెప్పాడ. అది కూడా దర్శకుడు కే విశ్వనాధ్ తో చిరంజీవి కాంబినేషన్ కలపాలని అలా చేశారట.

చిరంజీవి స్టార్‌గా ఎదగడంలో.. అల్లువారు నిర్మించిన చాలా సినిమాలు ప్రముఖ పాత్ర పోషించాయి. చిరంజీవి సినిమాల వల్ల గీతా ఆర్ట్స్ స్థాయి కూడా అమాంతం పెరిగింది. అల్ల అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చిరంజీవి హీరోగా వచ్చిన విజేత, శుభలేఖ, ఆరాధన, యమకింకరుడు, పసివాడి ప్రాణం, రౌడీ అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అన్నయ్య, ఎస్పీ పరశురామ్, మాస్టర్, డాడీ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. నిర్మాతగా అల్లు అరవింద్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఈ సినిమాలు కీలక పాత్ర పోషించాయి.

అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదుగా!

చిరంజీవిని ఇంటి అల్లుడిని చేసుకున్న తరువాత ఆయన వెన్నెంటే ఉన్నారు అరవింద్. మెగాస్టార్ తో వరుస సినిమాలు కూడా ప్లాన్ చేశాడు. అప్పటికే స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవితో మంచి మంచి సినిమాలు చేయాలని ఎప్పుడు ప్లాన్ చేస్తుండేవారట అల్లు అరవింద్.

ఈక్రమంలోనే ఆయన చూపు.. వరుస సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కె విశ్వనాథ్ మీదకు వెళ్ళింది. చిరంజీవితో విశ్వనాథ్ కాంబినేషన్ ఎలాగైనా కలిపితే.. అద్భుతమైన సినిమా వస్తుందని.. అది చిరంజీవి కెరీర్ కు కూడా ఉపయోగపడుతుందని అరవింద్ అనుకున్నారట.

గీతా ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ వెనుక అసలు కథ

కె విశ్వనాథ్ డైరెక్షన్ లో ఎలాగైనా చిరింజీవితో ఓ సినిమా చేయాలని చూసిన అరవింద్.. విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి.. చిరంజీవి గారు మీతో మంచి సినిమా చేయాలని ఆశపడుతున్నారని అబద్దం చెప్పాడు, ఇటు చిరంజీవి దగ్గరకు వచ్చి.. కె విశ్వనాథ్ గారు మీతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టైమ్ లో మీ కాంబోలో మంచి సినిమా పడితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారట. దాంతో వీరి కాంబోలో సినిమాలకు అరవింద్ రూట్ క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు.

చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. అరవింద్ ప్రయత్నంతో మొదటగా వీరి కొంబోలో శుభలేఖ సినిమా తెరెక్కింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఆతరువాత కాలంలో చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబోలో ఆపద్భాందవుడు, స్వయంకృషి సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలతో చిరంజీవికి ఎంతో పేరొచ్చింది. అందుకే కె విశ్వనాథ్ పై ఎంతో అభిమానం చూపించేవారు మెగాస్టార్. ఆయన తో చివరి వరకూ మంచి అనుబందం కొనసాగించారు.

చిరంజీవి, అల్లు అరవింద్, కె. విశ్వనాథ్ ల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ముందు ముందు తెలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.