|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Aravind: ఆమెను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా.. తన ఫోటో చూడగానే..

Published: 12-06-2025, 6:07 AM
Allu Aravind: ఆమెను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా.. తన ఫోటో చూడగానే..

సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక NM, మిత్రమండలి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Key Points

1

నిహారిక NM టాలీవుడ్ ఎంట్రీతో మిత్రమండలి చిత్రంలో నటిస్తోంది.

2

అల్లు అరవింద్ నిహారికను సోషల్ మీడియాలో ఫేక్ ఐడీతో ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు.

4

అల్లు అరవింద్ యువతతో ఎక్కువగా తిరుగుతూ వారి నుండి స్క్రిప్ట్ ఎంపికలో పట్టు సాధించారని చెప్పారు.

నిహారిక NM టాలీవుడ్ ఎంట్రీ

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ నిహారిక ఎన్‌.ఎమ్‌ ( Niharika NM ) టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. మిత్రమండలి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యాడ్‌ ఫేమ్‌ విష్ణు, ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం (జూన్‌ 12న) మిత్రమండలి సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌ ఆద్యంతం నవ్వించేలా ఉంది.

నేను వయసులో చిన్నవాడినే.. అయితే ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ కూడా అంతే సరదాగా సాగింది. తనను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసిన అల్లు అరవింద్‌ ( Allu Aravind )కు హృదయంలో చోటిచ్చానంది నిహారిక. అనంతరం అల్లు అరవింద్‌ స్టేజీ ఎక్కి మాట్లాడాడు. వీళ్లందరూ కలిసి నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. నేనేమో ఇంకా యంగ్‌గానే ఫీలవుతున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా మనసులో చోటిచ్చానంది. నేనెక్కువగా యంగ్‌ జెనరేషన్‌తో తిరుగుతూ ఉంటాను. వాళ్లతో ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి స్క్రిప్టులు సెలక్ట్‌ చేయాలన్నదానిపై కాస్త పట్టు లభించింది.

అల్లు అరవింద్ కామెంట్స్

కథ తెలీకుండా సినిమా చూడబోతున్నా ఈ సినిమా డైరెక్టర్‌ విజయేందర్‌ గురించి చెప్పాలి. ఈయన కథ చెప్తాడట.. వినమని వాసు అడిగాడు. సరేనన్నాను. విజయేందర్‌ వచ్చి నా గదిలో కూర్చుని పావుగంట కథ చెప్పాడు. సడన్‌గా నావల్ల కావడం లేదు సర్‌, నేనెళ్లిపోతాను అన్నాడు. ఏమైందని అడిగితే.. మీ రేంజ్‌ వేరు, నా వల్ల కావట్లేదు.. మళ్లీ ఎప్పుడైనా ప్రిపేర్‌ అయ్యి వస్తాను సర్‌ అని చెప్పి వెళ్లిపోయాడు. కథ తెలియకుండానే బన్నీ వాసు సినిమా చూడబోతున్నాను.

ఫేక్‌ ఐడీతో ఫాలో కొట్టా.. అయితే వాసు.. ఈ సినిమా కోసం ఐదారుగురు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు బాగుంటారు? చెప్పమన్నాడు. నేను నిహారిక ఫోటో చూడగానే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చూశాం అని చెప్పాను. ఇన్‌స్టాలో ఆమె చాలా స్పీడు. ఓ ఫేక్‌ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నాను. అందులో తప్పేముంది. మా ఒరిజినల్‌ ఐడీతో సోషల్‌ మీడియాకి వస్తే జనాలు పెట్టే కామెంట్లు చూడలేం, చదవలేం. ఆ దరిద్రమంతా ఎందుకని ఫేక్‌ ఐడీతో అందర్నీ ఫాలో అవుతా.. అందర్నీ చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా నిహారిక.. పెరుసు, ఇదయం మురళి వంటి చిత్రాల్లో నటించింది.

మిత్రమండలి సినిమా విశేషాలు

చివరగా, అల్లు అరవింద్ యొక్క ఆసక్తికర వ్యాఖ్యలు మరియు నిహారిక NM యొక్క టాలీవుడ్ ప్రవేశం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మిత్రమండలి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.