
📌 Key Points
- బన్నీ వాసు ఒక యానిమేటర్‌గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి, అల్లు అరవింద్ కుటుంబంలో కీలకమయ్యారు.
- అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో సన్నిహితంగా ఉండి, గీత ఆర్ట్స్ లో ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగారు.
- సినిమాలు కాకుండా ఇతర వ్యాపారాలు చేస్తే అల్లు అరవింద్ తనను పాలకొల్లు పంపించేస్తారని బన్నీ వాసు సరదాగా చెప్పారు.
- అల్లు అరవింద్ తనను తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటారని, సినిమాలపైనే దృష్టి పెట్టాలని ప్రోత్సహిస్తారని తెలిపారు.
బన్నీ వాసు అల్లు అరవింద్‌పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమాలు కాకుండా వేరే వ్యాపారాలు చేస్తే అల్లు అరవింద్ కోప్పడతారని, పాలకొల్లు పంపించేస్తారని సరదాగా చెప్పారు. అల్లు అరవింద్ తనను తండ్రిలా చూసుకుంటారని, వారి బంధంపై వివరాలు పంచుకున్నారు.
సినీ రంగంలో బన్నీ వాసు ప్రస్థానం
అల్లు అరవింద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ విషయంలో తిడతారు అన్న బన్నీవాసు
అల్లు అరవింద్ నమ్మకం, వారి బంధం
Bunny Vasu : ఒక యానిమేటర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ అల్లు అరవింద్ కి దగ్గరయి అల్లు అర్జున్ కి క్లోజ్ ఫ్రెండ్ అయి, అతనితో పని చేసి బన్నీ వాసు గా మారాడు. అల్లు అరవింద్, గీత ఆర్ట్స్ ఫ్యామిలిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు బన్నీ వాసు. అల్లు అరవింద్ కూడా బన్నీ వాసుని అంతగా నమ్మి తన సంస్థలో సినిమాలు ఆయనకు అప్పచెప్తున్నారు.(Bunny Vasu)
తాజాగా 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాసు అల్లు అరవింద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
“పాలకొల్లు పంపించేస్తారు” – వాస్తవం ఏంటి?
బన్నీ వాసు మాట్లాడుతూ.. నేను సినిమాలు కాకుండా వేరే వాటికి వెళ్తే అల్లు అరవింద్ గారు కన్నెర్రజేస్తారు. పాలకొల్లు పంపించేస్తారు మళ్ళీ నన్ను(నవ్వుతూ..). నాకు యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయింది. అప్పుడప్పుడు అక్కడ ఆ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉంది అని చేయాలనిపించి ఆయనతో మాట్లాడితే ఆయన కోప్పడతారు. ఇక్కడ ఫోకస్ చెయ్ అంటారు. నేను ఫోకస్ చేసే సినిమాలు బాగుంటాయి అని అయన నమ్మకం. అందుకే ఒకే దాని మీద, సినిమాల మీదే ఫోకస్ చేయమంటారు. ఆయన నాకు తండ్రి కంటే ఎక్కువ అని తెలిపారు.
అల్లు అరవింద్ మార్గదర్శకత్వంతోనే తాను సినిమాలపై దృష్టి సారించానని బన్నీ వాసు తెలిపారు. వారి మధ్య ఉన్న బలమైన బంధం, సినిమా పట్ల అంకితభావం ఈ వ్యాఖ్యలలో స్పష్టంగా కనిపించాయి.


