|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ 42 రూల్స్ లీక్: ఒక్క చూపుతోనే అంతా సైలెంట్! వైరల్ వీడియో!!

Published: 14-03-2026, 7:35 AM
అల్లు అర్జున్ 42 రూల్స్ లీక్: ఒక్క చూపుతోనే అంతా సైలెంట్! వైరల్ వీడియో!!
  • అల్లు అర్జున్ సినిమాస్ ప్రారంభోత్సవంలో షాకింగ్ ఘటన!
  • వెనక్కి తిరిగి చూడగానే ఆగిపోయిన జనం – 42 రూల్స్ నిజమేనా?
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ వీడియో!
  • కావేరి బారువా వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 42 రూల్స్ వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

42 రూల్స్ నిజమేనా? వైరల్ వీడియో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ పలు ఈవెంట్స్‌లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇడస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో బ్రాండ్ స్ట్రాటజీస్ట్ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఆయనను కలవాలంటే 42 నిబంధనలను పాటించాలని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో కావేరిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కావేరి క్షమాపణలు కోరింది. ఇక ఈ వివాదం ఇంతటితో ముగిసిందనుకుంటే.. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అల్లు అర్జున్ సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

తాజాగా, అల్లు అర్జున్ కోకాపేటలో ఏర్పాటు చేసిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం మార్చి 14న ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ భార్యతో కలిసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఇందులో అల్లు అర్జున్, తన భార్య స్నేహ రెడ్డితో కలిసి ‘అల్లు సినిమాస్‌’కు వెళ్తుండగా.. వారి వెనకే కొంతమంది వస్తున్నారు. అయితే ఒక్కసారిగా అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూడగానే వెనకాలే వస్తున్న వారంతా.. అక్కడిక్కడే ఆగిపోయా దూరం జరగడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దీంతో మరోసారి 42 నిబంధనలపై పలు వార్తలు వస్తున్నాయి. కొందరు అల్లు అర్జున్‌కు సపోర్ట్‌గా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం అల్లు భాయ్ ఒక్క చూపుతోనే తన నిబంధనలను అమలలోకి తీసుకువచ్చారంటూ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ నిబంధనలు అబద్ధం కాదు నిజమే అని అందుకే అల్లు అర్జున్ అలా చేశారని అంతా అంటున్నారు.

కావేరి బారువా వ్యాఖ్యలపై దుమారం!

A post shared by Instant Bollywood (@instantbollywood)

అల్లు అర్జున్ కు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను తెలుపండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.