
📌 Key Points
- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమా రూపొందనుంది.
- ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికైంది.
- మృణాల్ ఠాకూర్ కూడా ముఖ్య పాత్ర కోసం పరిశీలనలో ఉన్నారు.
- బాలీవుడ్ నటుల ఎంపికతో హిందీ మార్కెట్‌పై అట్లీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న AA22xA6 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది.
అల్లు అర్జున్ – అట్లీ మూవీ విశేషాలు
AA22xA6 : అల్లు అర్జున్…. అట్లీ కాంబినేషన్ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, సైన్స్ ఫిక్షన్ అంశాలతో, మాస్ ఎలిమెంట్స్ కలిపి రూపొందించబోయే ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా..అంతకుమించిన స్థాయిలో తీసుకెళ్లాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఫీమేల్ లీడ్‌గా అధికారికంగా ప్రకటించారు. దీపికా చేరడంతో హిందీ మార్కెట్‌లో సినిమాకు మంచి గుర్తింపు లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఆమె స్టార్ ఇమేజ్ వల్ల ఉత్తర భారత ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.
అట్లీ సినిమాల్లో పెద్ద క్యాస్ట్ ఉండటం సాధారణమే. ఈ సినిమాకు కూడా అదే విధంగా భారీ నటీనటులను ఎంపిక చేస్తున్నారని టాక్. ముఖ్య పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను నార్త్ ఇండియా మార్కెట్‌లో బలంగా నిలబెట్టడమే అట్లీ లక్ష్యంగా కనిపిస్తోంది.
బాలీవుడ్ తారల ఎంపిక వెనుక వ్యూహం
ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలీవుడ్ నతి..కాజోల్. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాజోల్ ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్టులు, కొన్ని ఎంపిక చేసిన సినిమాల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి మాస్ హీరో సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అట్లీతో ‘జవాన్’ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్‌కు మంచి సన్నిహిత సంబంధం ఉంది. అందుకే కాజోల్ పేరు ఆయన ద్వారా వచ్చి ఉండొచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అవి పూర్తిగా అవాస్తవమని తేలింది. మొత్తానికి చూస్తే, ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటుల సంఖ్య పెరుగుతుండటంతో అట్లీ హిందీ బాక్సాఫీస్‌ను చాలా జాగ్రత్తగా టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
దక్షిణాది ప్రేక్షకులపై ప్రభావం ఉంటుందా?
అల్లు అర్జున్‌కు ఇప్పటికే ఉత్తర భారతంలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. దానికి తోడు ఇలాంటి స్టార్ క్యాస్ట్ చేరితే సినిమా మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అయితే, బాలీవుడ్ ముఖాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, దక్షిణాది ప్రేక్షకుల అభిరుచిని అట్లీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, స్కేల్, క్యాస్టింగ్, బడ్జెట్ పరంగా ఈ సినిమా టాలీవుడ్ నుంచి రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుందని చెప్పొచ్చు.
మొత్తానికి అట్లీ బాలీవుడ్‌కు ప్రాధాన్యం ఇస్తుండటంతో, ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. బాలీవుడ్ నటులతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.


