
📌 Key Points
- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోంది.
- దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
- అనుష్క శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
- అనుష్క శర్మకు ఇది మొదటి తెలుగు సినిమా అవుతుందని సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క శర్మ కూడా నటించనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్, అట్లీ మూవీ అప్డేట్స్
Allu Arjun -Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. పుష్ప 2 (Pushpa 2)సినిమా ద్వారా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బన్నీ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ హై యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు తెలియనివ్వలేదు. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ల గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone) నటించబోతున్నట్లు అధికారకంగా తెలియజేశారు. ఇలా దీపికా కాకుండా మరికొంతమంది హీరోయిన్లు కూడా ఈ సినిమాలో బాగా కాబోతున్నారంటూ మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్లుగా దీపికా, అనుష్క?
ఇలా అల్లు అర్జున్ అట్లీ సినిమాలో దీపికా పదుకొనే కాకుండా మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి తదితరులు నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు. అయితే తాజాగా మరొకసారి హీరోయిన్ కూడా ఇందులో భాగం కాబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈ సినిమాలో భాగం కాబోతున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రముఖ ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)వైఫ్ ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma)ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసిన విరాట్ కోహ్లీ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి తెలుగు సినిమా ఇదే..
అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ?
అనుష్క శర్మ బన్నీ సినిమాలో నటించబోతున్నారని వార్తలు నిజమైతే కనుక అనుష్క శర్మకు మొట్టమొదటి తెలుగు డెబ్యూ సినిమా ఇదే కావటం విశేషం. ఇలా మొదటి సినిమానే టాలీవుడ్ టైర్ వన్ హీరోతో నటించే అవకాశాన్ని ఈమె అందుకున్నారని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న అనుష్క శర్మ పెళ్లి తర్వాత పిల్లలు జన్మించడంతో పిల్లల కోసం తన కెరియర్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇలా కొంత విరామం తర్వాత అనుష్క శర్మ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని ఇందులో భాగంగానే అల్లు అర్జున్ సినిమాలో అవకాశం అందుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
అనుష్క శర్మ నిజంగానే ఈ సినిమాలో నటిస్తే, ఇది ఆమెకు తెలుగులో మొదటి సినిమా అవుతుంది. దీని గురించి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది. ఈ వార్త అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.


