|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిల్ లీక్.. నిజమే అయితే ఫ్యాన్స్ కి పూనకాలే

Published: 26-05-2025, 11:38 AM
అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిల్ లీక్.. నిజమే అయితే ఫ్యాన్స్ కి పూనకాలే

దర్శకుడు అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి 700 కోట్ల బడ్జెట్‌తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Key Points

1

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కుతోంది.

2

700 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

4

‘ఐకాన్’ అనే టైటిల్ లీక్ అయి వైరల్‌గా మారింది.

అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్

`రాజా రాణి` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు అట్లీ. ఆ తర్వాత  విజయ్‌తో `తెరి`, `మెర్సల్`, `బిగిల్` వంటి హ్యాట్రిక్ హిట్ చిత్రాలను అందించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి షారుఖ్ ఖాన్‌తో `జవాన్` అనే మాస్ హిట్ చిత్రాన్ని అందించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. `జవాన్` సక్సెస్‌ అట్లీ కెరీర్‌నే మార్చేసింది. ఇండియాలోనే అత్యంత డిమాండ్‌ ఉన్న దర్శకుడిగా మారిపోయారు అట్లీ.

అట్లీ తదుపరి చిత్రం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని భారీ స్కేల్‌లో నిర్మించబోతుంది.  ఇది టైమ్ ట్రావెల్ చిత్రం కావడంతో హాలీవుడ్ టెక్నీషియన్లతో పని చేయాలని అట్లీ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి యానిమేషన్ పాత్ర. దాని కోసం ప్రపంచ స్థాయి VFX టీమ్‌లను దించుతున్నారు.

భారీ బడ్జెట్ సినిమా

అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. అందులో హీరో అల్లు అర్జున్‌కు 300 కోట్లు, అట్లీకి 100 కోట్లు పారితోషికంగా ఇచ్చింది సన్ పిక్చర్స్. ఈ చిత్రంలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారట. ప్రస్తుతానికి జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే, దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సమంత కూడా మెరవబోతుందట. మరో ఫారెన్‌ హీరోయిన్‌ని తీసుకోబోతున్నారని సమాచారం.

లీక్ అయిన టైటిల్

ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీగా ఉన్నారు అట్లీ.  ఇందలో ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఆన్‌లైన్‌లో లీక్ అయి వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని తెలుస్తుంది.  అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అని పిలుస్తారు. అందుకే అభిమానులకు ఈజీగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారా? లేదంటే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఇదే సరైన టైటిల్ అని భావించి పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో ఈ ప్రచారంలో నిజమెంతా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

చివరగా, ‘ఐకాన్’ టైటిల్ నిజమో కాదో తెలియాల్సి ఉంది. అయితే, ఈ సమాచారం అల్లు అర్జున్ అభిమానులను ఉత్సాహంగా ఉంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.