|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun – Atlee: అల్లు అర్జున్‌- ‍అట్లీ మూవీ.. హీరోయిన్‌గా ఎవరంటే?

Published: 28-10-2025, 9:36 AM
Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌- ‍అట్లీ మూవీ.. హీరోయిన్‌గా ఎవరంటే?

అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రానున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ఎంపికైనట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మృణాల్ షూట్‌లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో తెరకెక్కుతోంది.

Key Points

1

అల్లు అర్జున్‌-అట్లీ కాంబోలో తొలిసారి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రానుంది.

2

హీరోయిన్ ఎంపికపై కొన్ని నెలలుగా చర్చ జరగ్గా, దీపికా, రష్మిక పేర్లు వినిపించాయి.

4

AA22xA6 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా రూ. 800 కోట్లతో హాలీవుడ్ టచ్‌తో తెరకెక్కుతోంది.

అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్: హీరోయిన్‌పై సందిగ్ధత

పుష్ప – 2 బ్లాక్ ‌ బస్టర్ ‌ హిట్ ‌ తర్వాత అల్లు అర్జున్‌ ( Allu Arjun) మరో భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్ ‌ లో నటిస్తున్నారు . కోలీవుడ్ స్టార్ ‌ డైరెక్టర్ ‍ అట్లీతో ఆయన జతకట్టారు . వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది . ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి . అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక , జాన్వీ కపూర్ ‌, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ ‌ నడిచింది.

మృణాల్ ఠాకూర్ ఎంట్రీ: సినిమాపై మరింత బజ్

ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్ ‌ కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది . ఈ భారీ ప్రాజెక్ట్ ‌ లో సీతారామం ‍ బ్యూటీ హీరోయిన్ ‌ గా కన్ ‌ ఫామ్ ‌ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది . ఇప్పటికే మృణాల్ ‌ షూట్ ‌ లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ ‌ అప్‌డేట్‌. అంతేకాకుండా ‍ అల్లు అర్జున్ ‌ తో కీలక సన్నివేశాలు షూట్ ‌ చేసినట్లు తెలుస్తోంది . ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ‌ ఏర్పడింది . కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ ‌ టైటిల్ ‌ తో తెరకెక్కిస్తున్నారు.

AA22xA6: భారీ బడ్జెట్, హాలీవుడ్ కనెక్షన్

ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ ‌ టచ్ ‌ ఇచ్చేందుకు మేకర్స్ ‌ రెడీ అయ్యారు . ఈ మూవీలో హాలీవుడ్‌ హీరో విల్‌ స్మిత్‌ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి . అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ మరికొందరిని హాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది . ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్ అధినేత క‌ళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే .

అల్లు అర్జున్, అట్లీ, మృణాల్ కాంబోలో రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. హాలీవుడ్ నటుల భాగస్వామ్యం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.