
అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి తాజా వార్తలు వెలువడ్డాయి. ముంబైలో భారీ సెట్ వేసి, మూడు నెలల పాటు షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశాలలో నటించనున్నారు.
Key Points
అల్లు అర్జున్ – అట్లీ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం.
మూడు నెలల పాటు ముంబైలో భారీ సెట్‌లో షూటింగ్.
యాక్షన్ సన్నివేశాలతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం అమెరికా పర్యటన.
హాలీవుడ్ స్టైల్‌లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం.
ముంబైలో భారీ సెట్ ఏర్పాటు
Allu Arjun – Atlee : సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసింది అల్లు అర్జున్-అట్లీ సినిమా. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉండగానే ముంబైలో చాలా సైలెంట్‌గా పూజా సెర్మనీ కంప్లీట్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు టైమ్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ అట్లీ ఇటీవల ఆల్రెడీ హైదరాబాద్‌కి వచ్చివెళ్లారు.
అల్లు అర్జున్ కూడా ఇప్పటికే చాలా సార్లు హైదరాబాద్ టూ ముంబై చక్కర్లు కొడుతూవచ్చారు. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. దీంతో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇంతకాలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా టైమ్ తీసుకున్న బన్నీ-అట్లీ ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు.
మూడు నెలల పాటు షూటింగ్
పక్కా ప్లానింగ్‌తో ఫస్ట్ ఫెడ్యూల్‌కి టైమ్ ఫిక్స్ చేశారు డైరెక్టర్ అట్లీ. నెక్స్ట్ మంత్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో స్టార్ట్ కానుంది. దీని కోసం ముంబైలో ప్రత్యేకంగా సెట్ వేసారట. ముంబైలో వేసిన భారీ సెట్‌లో 3 నెలలపాటు ఫస్ట్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట డైరెక్టర్ అట్లీ. ఈ షెడ్యూల్‌లోనే అల్లు అర్జున్‌పై కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారు. ఇక 3 మంత్స్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత బన్నీ-అట్లీ టీమ్ మొత్తం వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం అమెరికా వెళ్తుందని సమాచారం.
హాలీవుడ్ స్టైల్ సైన్స్ ఫిక్షన్
అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌ని భారీ బడ్జెట్‌తో గ్రాండియర్ స్కేల్‌లో ప్రొడ్యూస్ చేస్తోంది సన్ పిక్చర్స్. హాలీవుడ్ మేకింగ్ స్టయిల్‌తో విజువల్ వండర్‌గా సినిమాని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అట్లీ. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇందులో ఒకటి కంప్లీట్‌గా నెగిటివ్ రోల్ ఉండే చాన్సుందంటున్నారు జనాలు. ఫీమేల్ లీడ్‌కి ఎక్కువుగా స్కోప్ ఉన్న ఈ సినిమాలో ఆల్రెడీ దీపిక పదుకొన్ ఫైనల్ అవ్వగా తర్వలోనే మృణాల్ ఠాకూర్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ కి చెందిన అల్లు అర్జున్, తమిళ్ కి చెందిన అట్లీ ఇటు హైదరాబాద్, అటు చెన్నై కాకుండా ముంబైలో సెట్ వేసి షూటింగ్ చేయడం గమనార్హం.
అల్లు అర్జున్-అట్లీ చిత్రం భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. మూడు నెలల షూటింగ్ తర్వాత వీఎఫ్ఎక్స్ కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


