|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది, ఆయనలా మనవాళ్లు కూడా ట్రై చేయొచ్చు.. నిర్మాత మధుర శ్రీధర్ కామెంట్స్

Published: 11-11-2025, 4:18 AM
హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది, ఆయనలా మనవాళ్లు కూడా ట్రై చేయొచ్చు.. నిర్మాత మధుర శ్రీధర్ కామెంట్స్

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమా మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంతో వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ, ఇమేజ్ భయంతో కొందరు హీరోలు ఈ కథను తిరస్కరించారని తెలిపారు. ఆయుష్మాన్ ఖురానాలా మన హీరోలు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ చేయాలని ఆయన సూచించారు.

Key Points

1

సంతాన ప్రాప్తిరస్తు మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం.

2

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించారు.

4

ఆయుష్మాన్ ఖురానాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ను ప్రోత్సహించాలన్నారు శ్రీధర్.

“సంతాన ప్రాప్తిరస్తు” కథా నేపథ్యం

హీరోయిన్ చాందిని చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సంతాన ప్రాప్తిరస్తు. మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ హీరోగా చేశాడు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా నిర్మించారు. నవంబర్ 14న సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ” సంతాన ప్రాప్తిరస్తు ” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సంతాన ప్రాప్తిరస్తు మూవీ హైలెట్స్ తెలిపారు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి.

-నేను, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి పదేళ్లుగా కలిసి జర్నీ చేస్తున్నాం. నేను నిర్మించిన “లేడీస్ అండ్ జెంటిల్ మేన్” మూవీకి రైటర్‌గా పనిచేశాడు. ఆ సినిమాకు అప్పటి ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాల్లో తృతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ ఎడిటర్‌గా నవీన్ నూలికి అవార్డ్ వచ్చింది. నవీన్ నూలికి ఎడిటర్‌గా తొలి చిత్రమది.

నిర్మాత మధుర శ్రీధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ దర్శకత్వంలో ఏబీసీడీ రూపొందించాం. సంజీవ్ అహ నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఈ స్క్రిప్ట్‌ను సంజీవ్ బాగా హ్యాండిల్ చేశారు. మేము 50 రోజులు షూటింగ్ అనుకుంటే ఆల్‌మోస్ట్ అనుకున్నది అనుకున్నట్లే చిత్రీకరణ జరుపుతూ వెళ్లాడు.

-ఏ కారణంతోనూ సినిమా షూటింగ్ ఆలస్యం కాలేదు. వర్షం కారణంగా ఒకట్రెండు రోజులు షూటింగ్ ఆపాం. అలా మొత్తం 56 డేస్‌లో “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా షూటింగ్ పూర్తి చేశాం.

-“సంతాన ప్రాప్తిరస్తు” స్క్రిప్ట్‌ను కొందరు పేరున్న హీరోలకు చెప్పాం. హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ అంశం వల్ల వాళ్ల ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందని మూవీ చేయలేదు.

-బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. మనవాళ్లు కూడా ఆయనలా ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత కొత్త అబ్బాయితో వెళ్దాం ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం.

బాలీవుడ్ హీరోతో పోలిక, మన హీరోలకు పిలుపు

-మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా మంచి ఆర్టిస్టులతో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది. కామెడీ ఎక్కడా కావాలని ఇరికించినట్లు ఉండదు. చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఫన్ క్రియేట్ చేశాం.

-వెన్నెల కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్.. ఇలా కాస్టింగ్ అంతా మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తారు. స్క్రిప్ట్ వరకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. డైరెక్షన్ మొత్తం సంజీవ్ చూసుకున్నాడు.

-మంచి లవ్ స్టోరీ, ఎమోషన్ ఉన్న క్లీన్ ఎంటర్‌టైనింగ్ మూవీ మాది. సామజవరగమన తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” అని నిర్మాత మధుర శ్రీధర్ తెలిపారు.

మధుర శ్రీధర్ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో కొత్త ఆలోచనలకు నాంది పలకాలని ఆశిద్దాం. విక్రాంత్, చాందినీల సంతాన ప్రాప్తిరస్తు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.