|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్ దుమ్ముదులిపేందుకు బన్నీ రెడీ! సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సంచలన మూవీ!

Published: 08-02-2026, 12:35 AM
బాలీవుడ్ దుమ్ముదులిపేందుకు బన్నీ రెడీ! సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సంచలన మూవీ!
  • అల్లు అర్జున్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
  • పుష్ప సినిమాతో బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
  • అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.
  • కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో అల్లు అర్జున్ తదుపరి సినిమా ఉంటుందని సమాచారం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

బాలీవుడ్ లోకి అల్లు అర్జున్ ఎంట్రీ?

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ లతో కన్నా తమిళనాడు డైరెక్టర్ తో వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ మీద ఉంది. ఆ తర్వాత కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్లోకి ఎంట్రీ పోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాని ఊపేస్తుంది. బాలీవుడ్ లోని ఏ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి ఎంటర్ అయిపోతున్నాడంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో విజువల్ వండర్ కు కేరాఫ్ గా మారిన దర్శకుడు సంజయ్ లీల భన్సాలీతో దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో సమాచారం.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయిందని తెలుస్తోంది. భారీ స్కేల్, గ్రాండ్ విజువల్స్, ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించాలని డైరెక్టర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. పుష్ప మూవీతో బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే అతని క్రేజ్ కూడా ఇంకా పెరుగుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..

సంజయ్ లీలా భన్సాలీతో సినిమా?

పుష్పతో పెరిగిన క్రేజ్

స్టార్ హీరో అల్లు అర్జున్ ఈమధ్య వరుసగా ప్యానల్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. పుష్ప తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.. తన 22వ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు.. అలాగే 23వ చిత్రాన్ని కూడా కోలీవుడ్ డైరెక్టర్ తోనే చేసే అవకాశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఆ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడంతో అతని క్రేజ్ అక్కడ కూడా పెరుగుతుందని ఆయన అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.. ఈ మూవీ కనుక హిట్ అయితే మాత్రం బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ స్టార్ హీరో అయిపోయినట్లే.. మరి ఈ మూవీతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ వార్త ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఎదురుచూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.