|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun: పుష్ప 2 మరువలేని ప్రయాణం.. గొప్ప గౌరవం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

Published: 05-12-2025, 4:48 AM
Allu Arjun: పుష్ప 2 మరువలేని ప్రయాణం.. గొప్ప గౌరవం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
  • పుష్ప 2 సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.
  • “పుష్ప ఐదేళ్ల మరువలేని ప్రయాణం.. అభిమానుల ప్రేమ గొప్ప గౌరవం” అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
  • పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ హిట్ గా నిలిచింది.
  • అల్లు అర్జున్ తదుపరి సినిమా అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకొనెతో రూ.800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. పుష్ప ప్రయాణం, అభిమానుల ప్రేమ, టీమ్‌తో పని చేయడం గొప్ప గౌరవం అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

పుష్ప 2: బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 ఏ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రికార్డులను క్రియేట్ చేసింది. పుష్ప లాంటి సూపర్ హిట్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది. కథ, ఎమోషన్, సాంగ్స్, యాక్షన్ ఇలా ప్రతీ విషయంలో నెంబర్ వన్ గా నిలిచింది ఈ సినిమా. ఇక సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్ప రాజ్ గా తన విశ్వరూపాన్ని చూపించాడు అల్లు అర్జున్(Allu Arjun). సినిమాలో తన మాస్ యాటిట్యూడ్ కి ఆడియన్స్ మెంటలెక్కిపోయారు.

Prabhas New Look: ప్రభాస్ కొత్త లుక్ అదిరింది.. ఈ ఫోటోలు మీరు చూశారా..

అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ వివరాలు

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాదించి ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2. అలా అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్ లో చాలా స్పెషల్ సినిమాగా నిలిచింది పుష్ప 2 మూవీ. తాజాగా ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా వేళ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు హీరో అల్లు అర్జున్.”పుష్ప అనేది ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణం. ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాకు సరికొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమాను ఇత అద్భుతంగా, ప్రత్యేకంగా మార్చిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి టీంతో పనిచేయడం ఎప్పుడు గొప్ప గౌరవంగానే ఉంటుంది” అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్.

అట్లీతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్

దీంతో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లు అర్జున్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పుష్ప 2 సాధించిన విజయం, ఆయన తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు మరింత పెంచింది. అభిమానులు ఆయన భవిష్యత్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.